వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar elections 2020: నితీష్ కుమార్ రెండో విజన్ డాక్యుమెంట్, విద్య, ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయే విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దీనికి సాత్ నిశ్చయ్ అనే పేరు పెట్టారు. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం విద్యార్థులు, వారి ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్య, వారికి ఐదేళ్లలో ఉద్యోగాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

2015లో నితీష్ కుమార్ మొదటి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అయితే, అప్పుడు ఆయన మహాగఠ్బందన్‌తో కలిసి పోటీ చేశారు. తాజా విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. ప్రభుత్వ విద్యలో మరింత నాణ్యతను పెంచుతామని తెలిపారు. ఐటీఐలు, పాలీటెక్నిక్ సంస్థలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారుస్తామన్నారు.

Bihar elections 2020: Nitish Kumar releases Saat Nischay Part-2

నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రూ. 5 లక్షల రుణాలు ఇస్తామని లేదా 50 శాతం ప్రాజెక్టు కాస్టులో ఎలాంటి వడ్డీ లేకుండా అందజేస్తామని తెలిపారు. మహిళల స్వయం సమృద్ధి, వ్యవస్థాపకతను పెంచుతోందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పంట పొలానికి నీరు అందేలా చూస్తామని రైతులకు సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి సోలార్ స్ట్రీట్ లైట్స్, రోడ్ కనెక్టివిటీ, సోలార్ పవర్ లాంటి అంశాలను సీఎం తన విజన్ డాక్యుమెంటులో పొందుపర్చారు.

నగరాల పరిశుభ్రత, సీనియర్ సిటిజన్లకు ఇళ్ల నిర్మాణం, ఆర్థికంగా వెనుకబడినవారి కోసం భవనాలు, నదుల వద్ద విద్యుత్ స్మశానాలు లాంటి అంశాలను కూడా చేర్చారు. రాష్ట్రంలోని గ్రామాలను పట్టణాలతో కలిపేందుకు రహదారులు, పట్టణాలు, నగరాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం, బైపాస్‌ల చేపడతామన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Is Out From Bigg Boss House || Oneindia Telugu

ప్రతీ గ్రామంలో ఆస్పత్రుల నిర్మాణం, వెటర్నరీ ఆస్పత్రుల అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ రాష్ట్రంలో మూడు దశల్లో (అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7) ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

English summary
Bihar Chief Minister Nitish Kumar’s JD(U) released 'vision document' entitled 'Saat Nischay' to ahead of assembly elections in the state to woo voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X