• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bihar elections.. నితీష్ కుమార్ పెద్ద పల్టూరామ్.. ముంగేర్ ఘటనపై నోరు మెదపరేం : చిరాగ్ పాశ్వాన్ ఫైర్

|

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విరుచుకుపడుతున్నారు లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ . ముంగేర్ లో దుర్గామాత భక్తులపై పోలీసుల కాల్పుల సంఘటనపై నితీష్ కుమార్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు . నితీష్ పెద్ద అవినీతి పరుడు అంటూ ,ఇప్పుడిప్పుడే అతని అసలు రంగు బయటపడుతుంది అంటూ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ నిప్పులు చెరిగారు .

15 సంవత్సరాలుగా ‘సుశాసన్ బాబు’ ట్యాగ్ ధరించి నితీష్ డ్రామా

15 సంవత్సరాలుగా ‘సుశాసన్ బాబు’ ట్యాగ్ ధరించి నితీష్ డ్రామా

నితీష్ కుమార్ 2015 లో లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఆయన అవినీతి అని విమర్శలు గుప్పించారు.

నితీష్ కుమార్ పెద్ద పల్టూ రామ్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు చిరాగ్ పాశ్వాన్ . ఆ పార్టీ , ఈ పార్టీ అంటూ పల్టీలు కొడుతూనే ఉన్నారని అన్నారు . సిఎం గత 15 సంవత్సరాలుగా ‘సుశాసన్ బాబు' ట్యాగ్ ధరించి డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ ముంగేర్ ఘటన గురించి కానీ , అవినీతిపై గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని విమర్శించారు .

దుర్గా భక్తులను కాల్చడం కంటే పెద్ద నేరం ఏమిటి?

దుర్గా భక్తులను కాల్చడం కంటే పెద్ద నేరం ఏమిటి?

ముంగేర్‌లో దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం చేసిన సమయంలో గత వారం ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన నితీష్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, 24 మందికి పైగా గాయపడ్డారు. మీ పోలీసులు అమాయక ప్రజలపై కాల్పులు జరపడం , దుర్గా భక్తులను కాల్చడం కంటే పెద్ద నేరం ఏమిటి అని ప్రశ్నించారు చిరాగ్ పాశ్వాన్ . నితీష్ కుమార్ ప్రభుత్వం మహిషాసుర రూపాన్ని తీసుకుందని ఫైర్ అయ్యారు.

నితీష్ ఎన్నికలలో గెలిస్తే మహాఘట్‌బందన్‌తో చేతులు కలుపుతాడు

నితీష్ ఎన్నికలలో గెలిస్తే మహాఘట్‌బందన్‌తో చేతులు కలుపుతాడు

దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా జనసమూహం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు, అయితే జనాన్ని నియంత్రించడానికి మీరు ప్రజలపై కాల్పులు జరుపుతారా? అంటూ చిరాగ్ ప్రశ్నించారు . ఒకవేళ ఈసారి నితీష్ ఎన్నికలలో గెలిస్తే మహాఘట్‌బందన్‌తో చేతులు కలపడమే అతడి మొదటి పని అని ఆరోపించారు చిరాగ్ పాశ్వాన్ .

తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అతన్ని కటకటాల వెనక్కు నెడతామని చెప్పిన మేరకు ఎల్‌జెపి చీఫ్ నితీష్ కుమార్ పై దూకుడుగా మాటల దాడి చేస్తున్నారు.

జెడియు పోటీచేసిన స్థానాలలోనే ఎల్జేపీ బరిలో

జెడియు పోటీచేసిన స్థానాలలోనే ఎల్జేపీ బరిలో

గతంలో ఎల్‌జెపి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) లో ఉంది . అయితే గతంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామి గా ఉన్న ఎల్జేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జెడియు పోటీచేసిన స్థానాలలోనే ఎల్జేపీ కూడా బరిలోకి దిగడం గమనార్హం. బిజెపి పోటీ చేసిన స్థానాలలో పోటీకి దూరంగా ఉన్న ఎల్జెపి నితీష్ కుమార్ విషయంలో మాత్రం విరుచుకుపడుతోంది.

 రేపే రెండో దశ పోలింగ్ .... నవంబర్ 7 న మూడో దశ

రేపే రెండో దశ పోలింగ్ .... నవంబర్ 7 న మూడో దశ

ఎన్నికల ప్రచారంలో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ పై నిప్పులు చెరుగుతున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020 లో మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28 న జరిగింది , రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో 71 స్థానాలు ఎన్నికలకు జరిగాయి . మంగళవారం, రెండవ దశలో 94 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 78 నియోజకవర్గాలు మూడవ మరియు చివరి దశలో నవంబర్ 7 న పోలింగ్ జరగనుంది . ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది.

English summary
Lok Janshakti Party (LJP) chief Chirag Paswan, who has been relentlessly attacking Bihar chief minister Nitish Kumar during the campaign for the Bihar assembly elections, on Monday fired a new jibe and slammed the Janata Dal(United) leader over the incident of police firing in Munger. “He (Kumar) is known as Palturam as he was against Lalu Prasad Yadav and then formed a government with him in 2015,” Paswan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X