వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Elections Exit Polls 2020:డెవలప్, నిరుద్యోగిత కీలకాంశాలు.. పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ

|
Google Oneindia TeluguNews

బీహర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మూడుసార్లు వరసగా సీఎం పదవీ చేపట్టిన నితీశ్ కుమార్‌పై వ్యతిరేకత కనిపించింది. అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వివిధ అంశాలను బేస్ చేసుకొని లెక్కగట్టింది. ఓవరాల్‌గా ఎన్నిక ఎలా జరిగిందనే అంశాన్ని వివరించింది. అయితే ఇందులో అభివృద్ది, నిరుద్యోగిత అనే రెండు అంశాలు కీలకంగా మారాయి.

అభివృద్ది మంత్ర..

అభివృద్ది మంత్ర..

గత కొన్నేళ్లుగా బీహర్ అభివృద్దికి నోచుకోవడం లేదు. నేతలు మాటలు చెప్పడం కానీ.. నిజ రూపం దాల్చలేదు. అయితే మరోసారి నితీశ్ కుమార్‌కు అధికారం ఇచ్చేందుకు సుముఖంగా లేరు. రాష్ట్రాభివృద్ధి ప్రధాన అంశంగా మారింది. అభివృద్ది అంశం 42 శాతంగా ఉంది. ఇకనైనా డెవలప్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. తర్వాత నిరుద్యోగిత కీలకంగా మారింది. 30 శాతం మంది నిరుద్యోగ సమస్యపై తీవ్రంగా భావిస్తున్నారు. ఇకనైనా తమకు ఉపాధి చూపించాలని కోరుకుంటున్నారు.

పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ

పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ

11 శాతం మంది ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందారు. ఇక రాజకీయ పార్టీలు అంటే 3 శాతం మంది రాజకీయ పార్టీలపై అసంతృప్తితో ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని గుస్సా మీదున్నారు. ప్రధాని మోడీ అంటే 3 శాత మంది వ్యతిరేకత చూపించారు. ఎన్నికల్లో కులం 1 శాతం ప్రభావం చూపించింది. జాతీయ భద్రత 1 శాతంగా ఉంది. సీఎం నితీశ్ కుమార్ 1 శాతం మాత్రమే ప్రభావం చూపించారు.

మెజార్టీ 122 సీట్లు

మెజార్టీ 122 సీట్లు

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి కావాలి.

English summary
people listed as in Bihar election development 42%, Unempolyment 30%, PM Modi 3%, Caste 1%- Indiatoday exit poll revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X