వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Elections Exit Polls 2020: సీఎంగా తేజస్వీకే బీహరీల మొగ్గు..44 శాతం మంది ఓకే,

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే మహగడ్ బందన్ వైపు పోల్స్ మొగ్గుచూపుతున్నాయి. అంతకుముందు నితీశ్ వైపు బీహరీలు విశ్వసించారని తెలిపాయి. కానీ ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. ఇక సీఎం ఎవరూ అంటే ఇదివరకు నితీశ్ అని ఢంకా బజాయించి చెప్పారు. కానీ నేడు అదీ తేజస్వీ వైపు మళ్లింది. మెజార్టీ ప్రజలు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని అభిప్రాయపడుతున్నారని ఇండియా టు డే యాక్సిస్ మై ఇండియా పోల్స్ రిపోర్ట్ చేశాయి.

Bihar: ABP-C VOTER EXIT POLL: 'తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..Bihar: ABP-C VOTER EXIT POLL: 'తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..

మహగడ్ బందన్ సీఎం అభ్యర్థిని తేజస్వి యాదవ్ పేరు ప్రకటించారు. అలానే ప్రచారం కొనసాగింది. అయితే తేజస్వీ సీఎం పదవీ చేపట్టాలని 44 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ తిరిగి పదవీ చేపట్టేందుకు 35 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. వీరి మధ్య దాదాపు 9 శాతం మంది ప్రజలు ఉండటం విశేషం.

Bihar Elections Exit Polls 2020:44% want Tejashwi Yadav to be next bihar CM

ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ సీఎం పోస్ట్ చేపట్టాలని కోరుకునే వారి సంఖ్య తగ్గింది. కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే అనులంగా ఉన్నారు. ఇక ఆర్ఎల్‌ఎస్పీ ఉపేంద్ర కుశ్వాను కేవలం 4 శాతం మంది మాత్రమే అంగీకరించారు. బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీని కేవలం 3 శాతం మాత్రమే అనుకూలంగా ఉన్నారు.

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి.

English summary
Bihar Exit Poll: Tejashwi Yadav favourite for chief minister post.. 4% want Tejashwi Yadav to be next CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X