వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Elections Exit Polls 2020:మహగడ్ బందన్‌కే మొగ్గు.. 118 నుంచి 138 సీట్లు

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెలుబడ్డాయి. రిపబ్లిక్ జన్ కీ బాత్ బీహర్ ఓటర్ నాడీని విశ్లేషించింది. అయితే అనూహ్యంగా ఎన్డీఏ కంటే మహాగడ్ బందన్ ఎక్కువ సీట్లు సాధిస్తోందని పేర్కొనడం విశేషం. కూటమి 118 నుంచి 138 సీట్లు సాధిస్తోందని తెలిపింది. దీంతో స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటు ఎన్డీఏ 91 నుంచి 117 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందన్నారు. ఇతరులు 3 నుంచి 6 సీట్లలో ప్రభావం చూపుతోందని అంచనా వేశారు. అయితే ఎల్జేపీ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేదని రిపబ్లిక్ జన్ కీ బాత్ లెక్కలతో తేలింది. మరీ వాస్తవం ఎలా ఉందో చూడాలీ మరీ.

Bihar Elections Exit Polls 2020:republic-jan ki baat predicts mgb win 118 to 138 seats

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి. అయితే ఈ సారి మోడీ మానియా పనిచేస్తుందో చూడాలీ. లేదంటే తేజస్వీ లేదా చిరాగ్ వైపు ఓటర్లు చూస్తారనే అంశంపై మరికొద్దిరోజుల్లో తెలియనుంది. కానీ రిపబ్లిక్ ప్రకారం మాత్రం అంచనాలు మారిపోయాయి.

English summary
republic-jan ki baat predicts mgb win 118 to 138 seats and nda will win 71 to 117 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X