వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..

|
Google Oneindia TeluguNews

వేల ఏళ్ల పరిణామక్రమంలాగే.. ప్రస్తుత కరోనా విలయాన్ని ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామిక పండుగలా భావించే ఎన్నికల ప్రక్రియలో వైరస్‌పై ఓటరు పైచేయి సాధించాడు. కరోనా కాలంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారతీయులు.. అందునా బీహారీలు గొప్ప చైతన్యం ప్రదర్శించారు.

కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా బుధవారం 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. గత(2015) ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ (54.94శాతం)గా ఉంది.

bihar elections: first phase polling ends peacefully:Voters Brave Pandemic, turnout details

అయితే, రాత్రికిగానీ ఫుల్ డీటెయిల్స్ అందుబాటులోకి వస్తాయని, చాలా చోట్ల 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారని, ఈసారి లెక్కలు స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

తొలి దశలో పోలింగ్ జరిగిన 71 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 31 వేల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఓటర్లకు థర్మల్ స్కానింగ్, చేతులకు శానిటైజేషన్, మాస్కుల ధారణ పక్కాగా అమలు చేశారు. కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో సోషల్ డిస్టెన్సిన్ నియమాన్ని కచ్చితంగా ఆచరించారు. పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు సైతం కరోనా పట్ల తమ చైతన్యాన్ని ప్రదర్శించారు.

bihar elections: first phase polling ends peacefully:Voters Brave Pandemic, turnout details

బీహార్ మంత్రి, బీజేపీ నేత, గయా అసెంబ్లీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ వ్యవహారం వివాదానికి దారి తీసింది. కమలం గుర్తు కలిగిన మాస్కును ధరించి ఆయన పోలింగ్ బూత్ లో ఓటేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే అని, మంత్రి ప్రేమ్ కుమార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు.

ఫస్ట్ ఫేజ్ లో నక్సల్స్ ప్రభావిత సెగ్మెంట్లలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడం గమనార్హం. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిర్దేశించిన ప్రాంతాలకు ఈవీఎంలను చేరవేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, చివరిదైన మూడో దశ పోలింగ్ నవంబర్ 7న జరుగనుంది.

English summary
the first phase polling in 71 assembly constituencies of bihar assembly elections ends peacefully on wednesday. Voter turnout of 52.24% recorded till 5 pm in the first phase of Bihar Polls. Temperature Checks and Face Masks Mark Polling In Bihar, Voters Brave Pandemic To Exercise Franchise. Bihar is the first in country to go to for polls even as the world continues to be under the grip of Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X