వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై నుంచి బీహార్‌కు పార్సిల్ - కొందరికి డబ్బు, మిగతావాళ్లకు వేరే: సంజయ్ రౌత్- శివసేన పోటీ?

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన నేత సంజయ్ రౌత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును బీహార్ ఎన్డీఏ ఎన్నికల అంశంగా మార్చడంపై ఆయన సెటైర్లు వేశారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, సుపరిపాలన ప్రధానాంశాలుగా సాగాల్సిన బీహార్ ఎన్నికలు దారితప్పాయని, కావాలంటే ముంబై నుంచి బిహార్ కు సమస్యాత్మక అంశాలను పార్శిల్ చేస్తామని రౌత్ అన్నారు.

 తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే.. తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..

ఈసీ క్లారిటీ ఇవ్వాలి..

ఈసీ క్లారిటీ ఇవ్వాలి..


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యవసాయ బిల్లులు, కార్మిక చట్టాల్లో మార్పులు, కరోనా పరిస్థితులు కీలక అంశాలుగా లేకుండా పోవడం విచారకరమని, అదేసమయంలో కుల సమీకరణాలు, సుశాంత్ మృతి లాంటి అంశాలే ప్రధానంగా ఎన్టీఏ ప్రచారాంశాలు రూపొందించడం శోచనీయమని సంజయ్ రౌత్ అన్నారు. బీహార్ లో కరోనా నిర్మూల కాకముందే ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ.. వైరస్ బారిన పడకుండా ప్రజలు ఎలా ఓటు వేయాలో, పార్టీలు ఎలా ప్రచారం చేయాలో క్లారిటీ ఇవ్వాలన్నారు. అంతేకాదు..

కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడుకిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడు

బీహార్ లో శివసేన పోటీ?

బీహార్ లో శివసేన పోటీ?


సుశాంత్ మరణం బీహార్ ఎన్నికల ఇష్యూగా మారిన తర్వాత బీహారీ పోలీస్ ఉన్నతాధికారులు, ముంబై పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకోవడం, బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తాను పదవిలో ఉండగానే మహారాష్ట్ర సర్కారుపై విమర్శలకు దిగడం తెలిసిందే. మొత్తంగా బీహారీల్లో ఉండే యాంటీ మహారాష్ట్ర సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలని ఎన్టీఏ ప్రయత్నిస్తుండగా, ఇటు శివసేన సైతం అనూహ్య నిర్ణయం దిశగా కదులుతున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేసే అంశంపై పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు.

డ్రగ్స్ కేసుపై అనూహ్య కామెంట్లు

డ్రగ్స్ కేసుపై అనూహ్య కామెంట్లు


నటుడు సుశాంత్ ఆత్మహత్యపై మొదలైన విచారణ ఇప్పుడు డ్రగ్స్ దిశకు కదిలిందని, రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలని సంజయ్ రౌత్ అన్నారు. ‘‘అయినా మత్తు అవసరంలేనిది ఎవరికి చెప్పండి? కొందరికి డబ్బు మత్తు.. ఇంకొందరికి వేరే వాటితో కిక్కు. సరైన దిశలో విచారణ సాగితే ఎవరికీ అభ్యంతరం లేదు. అలాకాదని కేంద్రంలోని ఎన్టీఏ తన రాజకీయ లబ్ది కోసం ఇంకా ఎన్ని ఏజెన్సీలను దింపినాసరే ఎదుర్కోడానికి మేం సిద్దంగా ఉన్నాం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పని డ్రగ్స్ రవాణాలను అరికట్టడం. అది వదిలేసి రోజుకొకర్ని విచారణ పేరుతో పిలుస్తున్నారు. సరే, అది వాళ్ల అధికారం కాబట్టి మనం చేసేదేమీ లేదు''అని శివనసేన నేత వ్యాఖ్యానించారు.

English summary
A day after the Election Commission of India announced the schedule of Bihar elections, Shiv Sena leader Sanjay Raut said if Bihar doesn’t have enough issues, Mumbai can parcel some. His jibe came in the backdrop of allegations that the death of Bollywood actor Sushant Singh Rajput, who hailed from Bihar, is being used as an election issue in Bihar. “Elections in Bihar should be fought on the issues of development, law and order, and good governance, but if these issues have exhausted, then issues from Mumbai can be sent as parcel,” the Shiv Sena leader said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X