వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ ఎన్నికలు: భారీగా సస్పెన్షన్లు - 15 మంది రెబల్స్ పై జేడీయూ - 9 మంది నేతలపై బీజేపీ వేటు

|
Google Oneindia TeluguNews

బిహార్ ఎన్నికల వేళ సస్పెన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలూ తిరుగుబాటు నేతలపై చర్యలకు దిగాయి. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ మంగళవారం అత్యవసర సమావేశంలో నిర్వహించి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న 15 మందిని బహిష్కరించింది. మరోవైపు బీజేపీ సైతం 9 మంది రెబల్స్ పై వేటు వేసింది.

జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ

జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు సహా 15 మంది నాయకులు ఉన్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి నవీన్‌ కుమార్‌ ఆర్యా.. బహిష్కరణకు గురైన వారి జాబితాను మీడియాకు విడుదల చేశారు. వారిలో దాదన్‌సింగ్ యాదవ్, రామేశ్వర్ పాశ్వాన్, భగవాన్‌సింగ్ కుష్వాహా, కాంచన్‌కుమారి గుప్తా, రణవిజయ్‌సింగ్ తదితరులు ఉన్నారు.

bihar-elections-jd-u-expels-15-bjp-expels-9-rebel-leaders-for-alleged-anti-party-activities

ఇక బీజేపీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై తొమ్మిది మందని బహిష్కరించింది. రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరాసియా, ఉషా విద్యార్తి, అనిల్ కుమార్, శ్వేతా సింగ్ తదితరులను ఆరేండ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ సంతకం చేసిన నోటీసు సోమవారం తెలిపింది. ఈ చర్యలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు.. రాష్ట్రంలో ఇరు పార్టీల సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేడి చూడాలి.

పీకే వల్ల భారీ డ్యామేజ్: సొంత రాష్ట్రంలో పాత్రపై బీజేపీ విమర్శలు - దిమ్మతిరిగేలా ఎదురుదాడి పీకే వల్ల భారీ డ్యామేజ్: సొంత రాష్ట్రంలో పాత్రపై బీజేపీ విమర్శలు - దిమ్మతిరిగేలా ఎదురుదాడి

బిహార్‌ అసెంబ్లీకి అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించనున్నారు. కాగా, టైమ్స్ నౌ సి-ఓటర్ అభిప్రాయ సేకరణ ప్రకారం.. బిహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి అధికారంలోకి రానున్నారు. కాంగ్రెస్‌-ఆర్‌జేడీ కూటమి పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోతుండటం బీజేపీ-జేడీ (యు) కూటమికి ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

English summary
The Nitish Kumar-led Janata Dal (United) on Tuesday expelled 15 of its leaders from the party for alleged anti-party activities, ANI reported. Those expelled include an MLA, former legislators and ex-ministers. BJP also expels 9 rebel leaders for contesting election against NDA candidates in Bihar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X