• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?

|

మరో పది రోజుల్లో బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగనుంది.. రాష్ట్రయ జనతాదళ్(ఆర్జేడీ) స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.. అయినాసరే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు, ఆ పార్టీ ఎంపీ మీసా భారతి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం, ఆమె ఎక్కడున్నారంటూ పార్టీ శ్రేణులు సైతం ఆరాతీస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీహార్ లో ఆర్జేడీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికల్లో లాలూ తనయ పాలుపంచుకోకపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?

మీసా ఎక్కడ?

మీసా ఎక్కడ?

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పాట్నా సిటీలోని 10, సర్క్యూట్ రోడ్డు భవంతి సందడిగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ నివాసమైన ఆ ఇంట్లో కీలక వ్యక్తి కనిపించకపోవడం ఆర్జేడీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. లాలూ సంతానంలో అందరకికంటే ముందుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పెద్ద కూతరు మీసా భారతి ప్రస్తుతం బీహార్ కు దూరంగా ఉంటున్నారు. భర్త శైలేంద్ర కుమార్, తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలోనే ఉంటోన్న ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సందర్బంలో మీసా చివరిసారిగా మీడియాకు కనిపించారు. బీహార్ ఎన్నికల్లో మీసా ప్రచారంపై ప్రశ్నలు వెల్లువెత్తుతుండటంతో ఆర్జేడీ నేతలు ఇలా చెప్పుకొచ్చారు...

 స్టార్ క్యాంపెయినర్..

స్టార్ క్యాంపెయినర్..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆర్జేడీ ఇటీవల ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎంపీ మీసా భారతి పేరు కూడా ఉంది. స్టార్ల జాబితాలో తల్లి రబ్రీ దేవి, తమ్ముళ్లు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్ ల తర్వాతి పేరు మీసా భారతిదే. జాబితాలోని నేతలందరూ ఇప్పటికే ప్రచారంలో బిజీ అయిపోగా, మీసా మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ‘‘ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నప్పటికీ, ఎన్నికల వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మీసా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం అనే సమస్యే ఉండదు. కొద్ది రోజుల్లోనే ఆమె రాష్ట్రంలోకి అడుగుపెడతారు..''అని లాలూ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆర్జేడీ ఎమ్మెల్యే భోలా యాదవ్, ఆర్జేడీ అధికారిక ప్రతినిధి చిత్రంజన్ గగాన్ వ్యాఖ్యానించారు. కాగా,

కార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్‌కు భారీ వర్ష సూచనకార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తమ్ముడి ఇమేజ్ కోసమేనా?

తమ్ముడి ఇమేజ్ కోసమేనా?

లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడిగా తేజస్వీ యాదవ్ పుంజుకుంటున్న వేళ.. మీసా భారతి ఉద్దేశపూర్వకంగానే యాక్టివిటీలు తగ్గించారని, కుటుంబం నుంచి ఒక్కరికే నేతగా గుర్తింపు లభించేలా, తమ్ముడు తేజస్వీ ఇమేజ్ మరింత పెరిగేలా ఉపకరించడంలో భాగంగానే మీసా ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. అదీగాక, మ‌నీలాండ‌రింగ్‌ కేసులో మీసా భారతి ఆమె భర్త శైలేష్‌పై ఈడీ చార్జిషీటు మోపిన దరిమిలా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశం కూడా ఆమె గైర్హాజరీకి ఓ కారణం అయి ఉండొచ్చని తెలుస్తోంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మీసా.. 2016 నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే..

  Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan
  తేజస్వీనే సీఎం అవుతారంటూ..

  తేజస్వీనే సీఎం అవుతారంటూ..

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు జాతీయ టీవీ ఛానెళ్లు నిర్వహించిన సర్వేల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారాన్ని నిలుపుకొంటుందని రిపోర్టులు రాగా.. సోషల్ మీడియాలో మాత్రం వేవే యూపీఏ వైపే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లు ప్రజాభిప్రాయాన్ని అడగ్గా.. మెజార్టీ జనం ‘ఈసారి తాము లాంతరు గుర్తుకే ఓటేస్తామని, తేజస్వీ యాదవే ముఖ్యమంత్రి అవుతారని' చెబుతుండటం గమనార్హం.

  English summary
  Even though assembly elections are less than a fortnight away in the state, incarcerated RJD chief Lalu Prasad’s eldest daughter Misa Bharti has so far stayed away from political activities. She is one of the star campaigners of the party. The question of her discontinuance from politics does not arise, says rjd leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X