వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

బీహార్లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అటు మహాకూటమి నేతలు, ఇటు ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవంబర్ 10 న బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందు వినమ్రంగా నమస్కరిస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అధికారం కోసం ఎంతకైనా నితీష్ దిగజారతారన్న చిరాగ్ పాశ్వాన్

అధికారం కోసం ఎంతకైనా నితీష్ దిగజారతారన్న చిరాగ్ పాశ్వాన్


ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారం కోసం తాపత్రయ పడుతున్నారని, ఎవరి ముందు తల దించుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నారని చిరాగ్ పాశ్వాన్ విమర్శలు గుప్పించారు. గతంలో అనేక మార్లు విమర్శలు గుప్పించిన నేతలతోనే కలిసి తిరుగుతూ, ఓట్ల కోసం వారి ముందు వంగివంగి నమస్కరించడం మీకు సంతోషంగా ఉందా అంటూ ప్రశ్నించారు. రేపు తేజస్వి యాదవ్ కు ముందు నితీష్ కుమార్ తలొగ్గినా సందేహించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు చిరాగ్ పాశ్వాన్ .

 నితీష్ బీజేపీతో సంబంధాలు తెంచుకోవటం పక్కా

నితీష్ బీజేపీతో సంబంధాలు తెంచుకోవటం పక్కా


శనివారం జరగనున్న మూడో, చివరి దశ పోలింగ్‌కు ముందు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు చిరాగ్ పాశ్వాన్ . పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు ఆర్టికల్ 370 వంటి విషయాలపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన నితీష్ కుమార్ , బిజెపి ప్రభుత్వాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలను ఈ సందర్భంగా పాశ్వాన్ ప్రస్తావించారు.

నితీష్ కుమార్ యొక్క జెడియు బిజెపితో సంబంధాలను తెంచుకోవడానికి మరియు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆర్జెడితో తిరిగి మిత్రపక్షంగా ఉండటానికి సిద్ధంగా ఉండవచ్చని చిరాగ్ పాశ్వాన్ సూచించడం ఇదే మొదటిసారి కాదు .

అధికారం కావాలనే బలహీనతతో నితీష్ ఏమైనా చేస్తారు

అధికారం కావాలనే బలహీనతతో నితీష్ ఏమైనా చేస్తారు

అక్టోబర్ 28 న, బీహార్ మొదటి దశలో ఓటు వేసినప్పుడు, నితీష్ కుమార్ బీజెపిని విడిచిపెట్టి, ఎన్నికల తరువాత ఆర్జెడితో వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాడు" అని ట్వీట్ చేశారు. ఈ రోజు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి కావాలనే తన బలహీనత కారణంగా నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధిలో విఫలమయ్యారని విమర్శించారు.
మీరు బలహీనమైన ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ స్వంతంగా ఏ పని చేయలేరు ... రాష్ట్రంలో అభివృద్ధిని సాధించలేరు . కానీ కేంద్రం అండగా ఉంటుందని ఏవేవో సాకులు చెప్తున్నారని మండిపడ్డారు . మిగతా వారందరూ ఉంటే సీఎం కుర్చీలో మీరు దేని కోసం పని చేస్తారు? అని పాశ్వాన్ నితీష్ ను నిలదీస్తున్నారు .

English summary
Nitish Kumar will bow before Tejashwi Yadav, the opposition alliance's chief ministerial candidate, once Bihar election results are declared on November 10, the LJP's Chirag Paswan said Thursday, hitting out at the Chief Minister over his "greed for power" and desire to remain in the top post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X