• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bihar elections..నవంబర్ 10 తర్వాత నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు:చిరాగ్ పాశ్వాన్

|

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నిప్పులు చెరుగుతున్నారు లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ . ముంగేర్ లో దుర్గామాత భక్తులపై పోలీసుల కాల్పుల సంఘటనపై నితీష్ కుమార్ నోరు మెదపడం లేదంటూ నిలదీసిన చిరాగ్ పాశ్వాన్ నేడు మరోమారు ఆయనపై విమర్శల బాణాలు సంధించారు .నవంబర్ 10 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ సిఎం అవ్వరని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గట్టిగా చెప్పారు.

  Bihar Polls Phase 2: Voting Begins In 94 Seats| Chirag Paswan VS Tejashwi Yadav | Oneindia Telugu
  బీహార్ మొదటిది, బిహారీ మొదటి ప్రాధాన్యత అన్న చిరాగ్

  బీహార్ మొదటిది, బిహారీ మొదటి ప్రాధాన్యత అన్న చిరాగ్

  నవంబర్ 10 తర్వాత నితీష్ కుమార్ మళ్లీ సిఎం అవ్వరని మీరు వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వమని మీరు నన్ను అడగవచ్చు . అయితే ఇందులో తనకు ఎలాంటి పాత్ర లేదని, ఎవరు పాలించినా సరే నాకు ‘బీహార్ మొదటిది, బిహారీ మొదటి ప్రాధాన్యత కావాలి. నాలుగు లక్షల బిహారీల ఆకాంక్షల మేరకు తయారుచేసిన విజన్ డాక్యుమెంట్ ప్రకారం పని చేయాలని కోరుకుంటున్నాను "అని చిరాగ్ చెప్పారు. అహంకారం కారణంగా గతంలోనూ ప్రజలు బడా నాయకులను గద్దె దింపారు. వారిని అధికారం నుండి తొలగించారు. ముఖ్యమంత్రికి ఇప్పటివరకు బిహార్ అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్ లేదు అంటూ విరుచుకుపడ్డారు .

  ముంగేర్ ఘటనతో ప్రచారంలో జోరుగా వాగ్బాణాలు

  ముంగేర్ ఘటనతో ప్రచారంలో జోరుగా వాగ్బాణాలు

  నితీష్ పెద్ద అవినీతి పరుడు అంటూ ,ఇప్పుడిప్పుడే అతని అసలు రంగు బయటపడుతుంది అంటూ నిప్పులు చెరిగిన చిరాగ్ పాశ్వాన్ నితీష్ పెద్ద పల్టూరాం అంటూ విమర్శించారు .సిఎం గత 15 సంవత్సరాలుగా ‘సుశాసన్ బాబు' ట్యాగ్ ధరించి డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చిరాగ్ పాశ్వాన్ నవంబర్ 10 తర్వాత అది సాధ్యం కాదన్నారు .

  హోరాహోరీగా జరుగుతున్న బీహార్ పోరులో నేతల మాటల తూటాలు జోరుగా పేలుతున్నాయి. ఇక ముంగేర్ ఘటనతో నితీష్ ను ఇరుకున పెట్టేలా టార్గెట్ చేస్తున్నారు ప్రధాన ప్రత్యర్థులు . ఇది ఇలా ఉంటే మహాగట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి మరియు రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజశ్వి యాదవ్ ఈ సారి విజయకేతనం ఎగరేస్తామని ధీమాతో ఉన్నారు.

  కొనసాగుతున్న పోలింగ్ ... కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు

  కొనసాగుతున్న పోలింగ్ ... కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు

  ప్రజలలో మార్పు సునామిలా ఉందని , బీహార్ ప్రజలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక అభివృద్ధి మొదలైన ఎజెండాపై ఓటు వేస్తారని చెప్పారు. అది తమతోనే సాధ్యం అని గట్టిగా ప్రచారం సాగిస్తున్నారు . మొదటి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 న జరిగాయి, రెండో దశ ఎన్నికలు ఈ రోజున కొనసాగుతున్నాయి . నవంబర్ 7 న తుది దశ పోలింగ్ కొనసాగనుంది . ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం తగిన చర్యలు చేపట్టారు .

  English summary
  Lok Janshakti Party (LJP) President Chirag Paswan on Tuesday said that Bihar Chief Minister Nitish Kumar will never become the CM again, after November 10.“You can get me to give you in writing that Nitish Kumar will never again be the CM after November 10. I will have no role to play, I want ‘Bihar first, Bihari first’. I want work to be done as per the vision document prepared by suggestions of four lakh Biharis,” Chirag told .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X