• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిహార్‌లో ఆయన శకం ముగిసినట్టే? ప్రభావం చూపలేని యువనేత: సింగిల్ డిజిట్‌కే లిమిట్?

|

పాట్నా: ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న రాష్ట్రం.. బిహార్. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద నియోజకవర్గాల్లో అదీ ఒకటి. కేంద్రంలో అధికారాన్ని ఎవరు అందుకోవాలనే విషయాన్ని నిర్ధారించే సామర్థ్యం బిహార్ రాజకీయాలకు ఉన్నాయి. అలాంటి కీలక రాష్ట్రంలో ఓ జాతీయ స్థాయి నాయకుడి శకం ముగిసినట్టే కనిపిస్తోంది. ఆయన వారసత్వాన్ని కొనసాగించే అవకాశాలు ఇప్పట్లో లేనట్టేననే విషయాన్ని తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇంకా తేలాల్సి ఉంది.

టైమ్స్‌నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్‌కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్

బిహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ శకానికి తెర పడినట్టేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను బిహారీయులు ఆదరించలేదని అభిప్రాయపడుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని చెబుతున్నాయి. చిరాగ్ పాశ్వాన్ సారథ్యాన్ని వహిస్తోన్న లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ)కి అయిదు కంటే ఎక్కువ స్థానాలు లభించకపోవచ్చని స్పష్టం చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్.. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే వస్తుందని అంచనా వేశాయి.

Bihar Exit Polls 2020: One seat and 7% vote share to the Chirag Paswan-led LJP

కేంద్రమంత్రిగా పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ బిహార్ రాజకీయాలపై పట్టు ఉంది. ఇదివరకు యూపీఏ కూటమిలో, ఆ తరువాత ఎన్డీఏలో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో.. ప్రస్తుతం నరేంద్ర మోడీ సర్కార్‌లోనూ ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. కొద్దిరోజుల కిందటే కన్నుమూశారు. ఆయన వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ సారథ్యయ బాధ్యతలను అందుకున్నారు. మొట్టమొదటి సారిగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. నిజానికి- సీట్ల సర్దుబాటు కుదురకపోవడంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ఒంటరిగా బరిలో నిల్చున్నారు.

బిహార్ భవిష్యత్ నేతగా చిరాగ్ పాశ్వాన్ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అవి ఫలించట్లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన రాఘోపూర్ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన కూడా గెలవలేకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగా పోటీ చేసిన ఆయన బలం ఏమిటో తేలిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ కూడా చిరాగ్ పాశ్వాన్‌ను ఆదరించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం రావొచ్చని అంటున్నారు.

English summary
Exit Polls 2020 on Bihar Assembly elections prediction that One seat and 7% vote share to the Chirag Paswan-led Lok Janshakti Party (LJP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X