వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!

|
Google Oneindia TeluguNews

గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన బీహార్ లోని గయ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవం కంటే ఒక రోజు ముందు జరిగిన అమానుష సంఘటన ఆనాటి చీకటి రోజులను గుర్తు చేసేలా ఉంది.

అత్యాచారం జరిగిందంటూ బాధితురాలి కుటుంబం గ్రామ పెద్దలను ఆశ్రయిస్తే నిందితులకు వత్తాసు పలికిన ఈ ఘటన దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. న్యాయం చేయాలంటూ పెద్ద మనుషుల దగ్గరకు వెళితే బాధితురాలికే శిక్ష వేశారు. ఆమెకు గుండు కొట్టించి వీధుల్లో ఊరేగించి అమానుషంగా ప్రవర్తించారు.

Bihar Girl gang raped and Head Shaved As Punishment six accused arrest

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!

ఈ నెల 14వ తేదీన పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను ఆరుగురు దుండగులు అపహరించారు. అనంతరం ఆమెను ఓ భవనం పైకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు రేప్ చేశారు. చివరకు ఆ దుండగుల పైశాచికత్వాన్ని తట్టుకోలేక ఆ బాలిక అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే స్థానికుడు ఒకరు ఆమెను ఆ స్టేజ్‌లో గుర్తించి వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

ఆ క్రమంలో జరిగిన విషయాన్ని పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే బాధితురాలికి అండగా నిలవాల్సిన ఊరి పెద్దలు వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. నిందితులు పలుకుబడి గల కుటుంబాలకు చెందిన వారు కావడంతో తప్పంతా బాలికదే అంటూ నిందించారు. అంతేకాదు ఆమెను శిక్షించాలనే ఉద్దేశంతో గుండు కొట్టించి ఊరంతా తిప్పారు. ఆ నేపథ్యంలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా.. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

English summary
Six people were detained on Tuesday in a shocking case in which a minor girl was gang-raped, her head was shaved and she was paraded through her village as a punishment by the panchayat in Gaya district of Bihar, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X