వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్లు వేసుకుని ఉల్లి విక్రయిస్తున్న ఉద్యోగులు, ఉల్లి కోసం ప్రజలు దేనికైనా సిద్దం, పోలీసులు !

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఉల్లిపాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు వాటి జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయ్యదు అంటారు పెద్దలు, అయితే అది సామెత వరకే బాగుటుంది. ఇప్పుడు ఉల్లి లేకుండా ఇంటిలో ఆ తల్లి ఏ కూర చెయ్యలేని పరిస్థతి ఏర్పడింది. కారణం ఉల్లిపాయల ధరలు ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిపోయాయి. ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే సామాన్యుడికి పట్టపగలు చుక్కలు కనపడుతున్నాయి.

అయితే ఉల్లిపాయలు లేకుండా మేము ఏ కూరా చెయ్యలేమని, ఉల్లి లేకుంటే ఆ కూర రుచిగా కూడ ఉండదని ఇంటిలోని మహిళలు తేల్చి చెబుతున్నారు. రాయితీలో ఉల్లిపాయలు విక్రయించాలంటే మొదట మేము క్షేమంగా ఉండాలి కదా, అందుకే మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని బీహార్ లోని సహకార సంఘం ఉద్యోగులు అంటున్నారు. ఉల్లిపాయులు విక్రయించడానికి వారు ఏకంగా హెల్మెట్లు వేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

 ఉల్లికి ఉండే డిమాండ్ దేనికైనా ఉందా ?

ఉల్లికి ఉండే డిమాండ్ దేనికైనా ఉందా ?

ఉల్లిపాయలు కేజీ ధర రూ. 100 దాటిపోయింది. అనేక రాష్ట్రల నుంచి ఇతర రాష్ట్రాలు ఉల్లిపాయలు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. కోల్ కతాలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకులు ఉచితంగా ఉల్లిపాయులు పంపిణి చెయ్యడానికి ప్రయత్నిస్తే వాటిని తీసుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు సహనం కోల్పోయి వారి మీద రాళ్లతో దాడులు చేశారు. కర్ణాటకలోని గదగ్ ప్రాంతంలో డబ్బులు మాత్రం అక్కడే వదిలేసి ఉల్లిపాయులు చోరీలు చేసిన విచిత్ర సంఘటన వెలుగు చూసింది.

 బీహార్ ప్రభుత్వం నిర్ణయం

బీహార్ ప్రభుత్వం నిర్ణయం

బీహార్ లో సహకార సంఘం ఉద్యోగులకు విచిత్రమైన సంఘటన ఎదురైయ్యింది. బీహార్ లో ఉల్లిపాయల ధర కేజీ రూ. 120 దాటి పోయింది. బీహార్ ప్రభుత్వం రాజస్థాన్ లో కేజీ ఉల్లిపాయులు రూ. 60 కోనుగోలు చేసి బీహార్ లోని ప్రజలకు రాయితీలో కేజీ ఉల్లిపాయులు రూ. 30 విక్రయించడానికి సిద్దం అయ్యింది.

 చేతులు ఎత్తేసిన పోలీసులు

చేతులు ఎత్తేసిన పోలీసులు

బీహార్ ప్రభుత్వం సహాకర సంఘం ఆధ్వర్యంలో విక్రయిస్తున్న ఉల్లిపాయులు కొనుగోలు చెయ్యడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ప్రభుత్వం రాయితీలో విక్రయిస్తున్న ఉల్లిపాయలు కొనుగోలు చెయ్యడానికి కొన్ని చోట్ల నాలుగు కిలోమీటర్ల దూరం వరకు బారులుతీరారు. ఉల్లిపాయలు విక్రయించడానికి మాకు భద్రత కల్పించాలని సహకార సంఘం ఉద్యోగులు పోలీసులకు మనవి చేశారు. అయితే ప్రజలు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో క్యూకట్టి ఉల్లిపాయులు కొనుగోలు చెయ్యడానికి సిద్దం కావడంతో భద్రత కల్పించడం మాకు సాధ్యం కాదని పోలీసులు చేతులు ఎత్తేశారు.

 హెల్మెట్లే మాకు దిక్కు

హెల్మెట్లే మాకు దిక్కు

పోలీసులు చేతులు ఎత్తేయడంతో సహకార సంఘం ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు. కొన్ని చోట్ల ఉల్లిపాయలు కొనుగోలు చెయ్యడానికి వచ్చిన ప్రజలు సహనం కోల్పోయి ఉద్యోగుల మీద రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలు రాళ్లతో దాడిచేసినా తప్పించుకోవాలని ఆలోచించిన ఉద్యోగులు తలకు హెల్మెట్లు పెట్టుకుని రాయితీ ధరలో ఉల్లిపాయులు విక్రయించడానికి సిద్దం అయ్యారు.

 మా జాగ్రత్తల్లో మేము ఉంటాం

మా జాగ్రత్తల్లో మేము ఉంటాం

రాయితీ ధరలో ఉల్లిపాయులు విక్రయిస్తున్న బీహార్ ప్రభుత్వ సహకార సంఘం ఉద్యోగులు ఇంటి నుంచి హెల్మెట్లు తీసుకెలుతున్నారు. ఉల్లిపాయులు కొనుగోలు చేసే వారు సహనం కోల్పోయి రాళ్లతో దాడి చేసినా మేము హెల్మెట్లు వేసుకుని తప్పించుకుంటున్నామని, మా జాగ్రత్తలో మేము లేకుంటే మాకే నష్టం అని అంటున్నారు. మొత్తం మీద బీహార్ సహకార సంఘం ఉద్యోగులు ఉల్లిపాయలు విక్రయించడానికి హెల్మెట్లు వేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.

English summary
Bihar state co-operative society employee sell onion by wearing helmet. They sell onions in very less price than market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X