వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ని వికెట్లు పడిపోయాయి...! పిల్లల మరణాలపై చర్చిస్తూ... బీహార్‌ మంత్రీ ఆరా...! వీడియో

|
Google Oneindia TeluguNews

బీహార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అడ్డంగా బుక్కయ్యాడు, ఓవైపు పిల్లల మరణాలపై చర్చిస్తూనే మరోవైపు క్రికెట్ స్కోర్‌పై ఎంత అంటూ తీశాడు. దీంతో సదరు మంత్రి పలు విమర్శలు ఎదుర్కోంటున్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి అదికూడ పిల్లల మరణాలపై చర్చించే సమయంలో అసంధర్భంగా పత్రికా విలేకరుల ముందే క్రికెట్ స్కోర్ అడగడంతో అడ్డంగా బుక్కయ్యాడు..

 బీహార్ మరణాలపై కేంద్రమంత్రి రివ్యూ

బీహార్ మరణాలపై కేంద్రమంత్రి రివ్యూ

గత కొద్ది రోజులుగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధితో వందకు పైగా చిన్నారులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే గత ఆదివారం పిల్లల మరణాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ బీహార్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ మీడియా సమావేశంలో హర్షవర్థన్‌తో పాటు మరో కేంద్ర సహాయ మంత్రి అయిన అశ్విని కుమార్ చౌదరీ తోపాటు రాష్ట్ర్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంగల్ పాండే సైతం హజరయ్యారు...

ప్రెస్ మీట్‌లోనే క్రికెట్ గురించి ఆరా

ప్రెస్ మీట్‌లోనే క్రికెట్ గురించి ఆరా

అయితే మంగల్ పాండే ప్రెస్ మీట్ అవుతున్న సంధర్భంలోనే అసంధర్బగా క్రికేట్ మ్యాచ్ సంబంధించిన వివరాలను అడగడం రికార్డ్ అయింది. కాగా ఆదివారం పాకిస్థాన్ ,ఇండియాల మధ్య క్రికెట్ మ్యాచ్ కొనసాగిన విషయం తెలిసిందే...దీంతో ఆ మ్యాచ్‌కు సంబంధించి రెండు దేశాల ప్రజలు, క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇందులో భాగంగానే తాను ఓ అధికారిక సమావేశంలో ఉన్నాననే విషయాన్ని మరచిపోయిన మంగల్ పాండే ఎన్ని వికెట్లు పడిపోయాయి అని అడిగాడు దీంతో పక్కనే ఉన్నవారు 4 అనే సమాధానం వచ్చింది.

మంత్రి రాజీనామ చేయాలి...

మంత్రి రాజీనామ చేయాలి...

దీంతో బీహార్ ప్రతిపక్ష పార్టీ నేతలు మంగల్ పాండే రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పిల్లల మరణాలకంటే క్రికెట్ మీద ఆసక్తే ఎక్కువగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాగా ఇప్పటికే 100 మందికి పైగా చిన్న పిల్లలు మెదడు వాపు వ్యాధితో మృతి చెందారు. మంగల్ పాండే వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

English summary
Union Health Minister Dr Harsh Vardhan held a press meet with Minister Of State for Health and Family Welfare Ashwini Kumar Choubey and Bihar Health Minister Mangal Pandey in Muzaffarpur on Sunday. On the agenda were several pressing issues, including the death of more than 100 children due to encephalitis over the last two weeks and strategies the centre should adopt to ensure that such tragedies don't recur in the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X