వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రిని కిరాయి హంతకులతో చంపించిన కొడుకు, ఎందుకో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: తండ్రి చేసే ఉద్యోగం కోసం ఓ కసాయి కొడుకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ హత్యకు గల కారణాలను తెలుసుకొని షాక్‌కు గురయ్యారు.

బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ మండల్ ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆఫీసర్స్ క్లబ్ రోడ్డులో కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఒంప్రకాష్ హత్యకు సంబంధించిన కేసును విచారించిన పోలీసులకు షాక్ తిన్నారు.

Bihar: Man gives father’s ‘supari’ for rail job

ఓంప్రకాష్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని షూటర్ రవి రంజన్ గా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై అతడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.

రైల్వే ఉద్యోగి అయిన ఓంప్రకాష్ ఏప్రిల్ 30వతేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అతని కుమారుడు పవన్ మండల్ ఎన్ని పోటీ పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగం లభించక పోవడంతో తండ్రిని చంపిస్తే తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందని భావించాడు.

తండ్రి హత్యకు కుమారుడు సుపారీ ఇచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పవన్ కిరాయిహంతకులతో రెండులక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకొని సగం డబ్బులు ఇచ్చాడని వెల్లడైంది. రవిరంజన్, సునీల్ మండల్ లతోపాటు పవన్, మధ్యవర్తులు విక్కీ, జుగ్నులను అరెస్టు చేశామని పోలీసు అధికారి ముహమ్మద్ అలీ సాబ్రీ వెల్లడించారు.

English summary
A day after a railway employee was shot at, police on Wednesday arrested his son for plotting his father’s murder. Two contract killers were also nabbed.Om Prakash Mandal was shot at on his shoulder while he was on way to his workplace on Officer’s Club Road under the East Colony police station area in Munger district on Tuesday morning. He was admitted to the local railway hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X