వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్‌ఫోన్ దొంగిలించాడని జేసీబీకి వేలాడదీసి చిత్రహింసలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: మొబైల్ దొంగతనం చేశారనే నెపంతో బీహార్ రాష్ట్రంలోని దర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మొబైల్‌ఫోన్‌ను దొంగిలించాడని ఆరోపిస్తూ జేసీబీ యంత్రానికి వేలాడదీసి హింసించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బీహర్ రాష్ట్రంలోని దర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని హింగోలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రీషీయన్‌గా పనిచేస్తున్నాడు అయితే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మొబైల్ చోరీకి గురైంది. ఈ విషయమై ఎటక్ట్రిషీయన్‌ను ఆ వ్యక్తి అనుమానించాడు.

Bihar: Man hung upside down, beaten for allegedly stealing a mobile phone

ఫోన్ విషయమై ప్రశ్నించాడు కానీ, తనకు ఫోన్ గురించి తెలియదని ఎలక్ట్రీషీయన్ సమాధానం చెప్పాడు. కానీ, మొబైల్ పోయిన వ్యక్తి మాత్రం ఈ విషయాన్ని నమ్మలేదు. వెంటనే జేసీబీకి ఎలక్ట్రీషీయన్‌ను వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు.

మొబైల్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తనకు మొబైల్ గురించి తెలియదని ఆయన చెప్పినా వినకుండా హింసకు పాల్పడ్డారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎలక్ట్రీషీయన్‌ను చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
A man was hung upside down and beaten mercilessly by locals in Darbhanga's Hingoli village for allegedly stealing a mobile phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X