• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీహార్ భగీరరథుడు లాంగి భూయాన్-ఒక్కడే 30 ఏళ్లు చమటోడ్చి,ఊరికి కాలువ-పిరమిడ్ కన్నా గొప్పది

|

చనిపోయిన తన పూర్వీకులకు స్వర్గలోకం ప్రాప్తించాలన్న లక్ష్యంతో పరమశివుడి అనుగ్రహం పొంది గంగ ను నేలకు తెస్తాడు భగీరథుడనే మహారాజు. ఇది పురాణాల్లో మనం చదువుకున్న కథ. సొంత ఊరిలో వ్యవసాయానికి, పశుపోషణకు నీళ్లు లేక ఒక్కొక్కరుగా పట్నాలకు వలసపోతుంటే చూసి తట్టుకోలేక ఒంటిచేత్తో 30 ఏళ్లు శ్రమించి నీటి కాలువ తొవ్వాడు లాంగి భూయాన్. ఇది బీహార్ లో చోటుచేసుకున్న నిజజీవిత విజయగాథ.

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

30 ఏళ్లు.. 3 కి.మీ కాలువ..

30 ఏళ్లు.. 3 కి.మీ కాలువ..

ఊరికి దారిలేక, కొండ ఎక్కి దిగుతున్న క్రమంలో తన భార్య చనిపోవడంతో కలతచెంది, 22 ఏళ్లపాటు ఒంటరిగా కష్టపడి భారీ కొండను తొలిచి రోడ్డు నిర్మించి, ‘మౌంటెన్ మ్యాన్'గా పేరుపొందాడు దశరథ్ మాంఝీ. ఆ యోధుడు పుట్టిన బీహార్ గడ్డపైనే ఇప్పుడీ అపర భగీరథుడు భూయాన్ ఒంటి చేత్తో ఊరికి కాలువ తొవ్వాడు. బీడు వారిన పొలాలను పచ్చగా చేయాలన్న సంకల్పంతో ౩౦ ఏండ్లపాటు చెమటోడ్చి 3 కిలోమీటర్ల వరద కాలువ ఏర్పాటు చేశాడు. పశువులు కాసేందుకు నిత్యం అడవికి వెళుతూ.. రోజుకు కొంత దూరం చొప్పున కాలువ తొవ్వుతూ చివరికి ఊరికి నీళ్లొచ్చేలా చేశాడు.

గయా జిల్లా మారుమూల గ్రామం

గయా జిల్లా మారుమూల గ్రామం

బిహార్‌లో గయా జిల్లా దట్టమైన అడవులకు, మావోయిస్టుల ప్రాబల్యానికి ప్రసిద్ది. అక్కడి బారాఛట్టి మండలం లథువా పంచాయితీ పరిధిలోని మారుమూల గ్రామం కోథిలావాకు చెందిన వ్యక్తే లాంగి భూయాన్. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు. తన 40వ ఏట కాలువ తొవ్వే పనిని ప్రారంభించే నాటికి.. ఆ ఊళ్లో మంచినీరే కష్టంగా దొరికేది. ఇక సాగుకు, పశుపోషణకు నిత్యం నీటి కరువే. ఆ పరిస్థితుల్లో ఊళ్లోని ఒక్కో కుంటుంబం.. మెల్లగా దగ్గరలోని పట్నాలకు వలస వెళ్లిపోసాగాయి. పశుల కాపరి అయిన భూయాన్.. అడవుల్లో తిరుగుతున్న క్రమంలో.. వర్షపునీరు తన గ్రామానికి కాకుండా దగ్గర్లోని నదికి పారుతుండటాన్ని గుర్తించిన వెంటనే కాలువ తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలా 30 ఏళ్లు రెండో మనిషి సహాయం లేకుండా ఒంటిచేత్తో ఊరికి నీళ్లు రప్పించాడు.

ఇప్పుడా ఊరు ఇంకా పచ్చగా..

ఇప్పుడా ఊరు ఇంకా పచ్చగా..

కొండప్రాంతంలో పడే వర్షపు నీటిని మళ్లించి తన గ్రామం శివారులోని చెరువుకు కలిపేలా భూయాన్ కాలువ తొవ్వడంతో ఇప్పుడక్కడ పంటలు పండించుకునేందుకు వీలుకలిగింది. అంతేకాదు, మూగజీవాలకు కూడా దాహార్తి తీరింది. ‘‘అందరూ వలస పోతుంటే చాలా బాధపడేవాణ్ని. నేను మాత్రం ఊళ్లో ఉండిపోయాను. కాలువ తొవ్వకం పూర్తయిన తర్వాత చెరువులో జలకళ పెరిగింది. ఆ నీటితోనే పంటలు పండింస్తున్నాను. నన్ను చూసి ఇంకొందరు కూడా పట్టణాలను వదిలేసి తిరిగి ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. ఇంతకంటే సంతోషం ఏముంటుంది?'' అని లాంగి భూయాన్ నవ్వుతూ అంటారు.

దీని కంటే తాజ్, పిరమిడ్స్ గొప్పవా?

దీని కంటే తాజ్, పిరమిడ్స్ గొప్పవా?

బీహార్ వృద్ధుడు లాంగి భూయాన్ 30 ఏళ్లు కష్టపడి ఊరికి కాలువ నిర్మించిన వైనం ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ బీహార్ భగీరథుడిని ఒక్కతీరుగా ప్రశంసించారు. ‘‘ఈ భూమ్మీద అనేక అద్భుతమైన స్మారక కట్టడాలు నిర్మించబడ్డాయి. అవన్నీ, చక్రవర్తుల కీర్తికి గుర్తులుగా దశాబ్దాల పాటు పేదల చెమటతో నిర్మితమైన కట్టడాలు. నా దృష్టిలో లాంగి భూయాన్ నిర్మించిన ఈ కాలువ ముందు.. పిరమిడ్లు లేదా తాజ్ మహల్ గొప్పవి కావు'' అని ఆనంద్ మహీద్రా వ్యాఖ్యానించారు. తన సొంతానికి కాకుండా, ఊరి కోసం పరితపించిన భూయాన్ అందరికీ ఆదర్శప్రాయుడని కోథిలావాలో టీచర్ గా పనిచేస్తోన్న రామ్ విలాస్ సింగ్‌ అన్నారు.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

English summary
In Bihar, a man has carved out a 3-km-long canal to take rainwater coming down from nearby hills to fields of his village, Kothilawa in Lahthua area of Gaya. Laungi Bhuiyan said, “It took me 30 years to dig this canal which takes the water to a pond in the village. For the last 30 years, I would go to the nearby jungle to tend my cattle and dig out the canal.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X