వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేనిఫెస్టోలో కొలువుల జాతర.. కానీ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్దం.. అయినా నితీశ్‌ వైపే..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు లక్షల కొలువులు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఆర్జేడీ 10 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిస్తే.. జాతీయ పార్టీ బీజేపీ 19 లక్షలు అని చెప్పింది. కానీ రియాలిటీ మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది.

ABP-CVoter Opinion Poll: మిథిలాంచల్‌లో వార్ వన్ సైడే.. నితీశ్‌ కూటమికి 41 శాతం..ABP-CVoter Opinion Poll: మిథిలాంచల్‌లో వార్ వన్ సైడే.. నితీశ్‌ కూటమికి 41 శాతం..

ఇటీవల దేశంలో లేబర్ ఫోర్స్ సర్వే చేపట్టింది. దేశంలో నిరుద్యోగిత గురించి అంశాలను సేకరించింది. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు డేటా కలెక్ట్ చేయగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. దేశంలో నిరుద్యోగితలో బీహర్ యువత ఎక్కువగా ఉన్నారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళలో 35.2 శాతం నిరుద్యోగులు ఉండగా.. బీహర్‌లో 30.9 శాతం ఉన్నారు. ఒకటింటా మూడోవంతు 15 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువత ఉద్యోగాలు ఉన్నారు.

Bihar manifestos rain jobs, but reality is grim

నిరుద్యోగ యువత మాత్రం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి అండగా నిలవడం విశేషం. బర్హ్ నియోజకవర్గంలో గల పురైబాగ్‌కి చెందిన అఖిలేష్ కుమార్ నితీష్ ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. కష్టపడి చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తోందని చెప్పారు. అతని బంధువు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో యువకుడు గ్యాన్ రంజన్ కుమార్ కూడా ఇదే వైఖరి స్పష్టంచేశారు. తమ మొదటి ప్రయారిటీ తిరిగి జంగల్ రాజ్ అధికారంలోకి రావొద్దని చెప్పారు.

బీహర్ ఎన్నికల తొలి విడత ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో క్యాంపెయిన్ పూర్తవుతోంది. ఈ నెల 28వ తేదీ బుధవారం మొదటి విడత 71 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. రెండో విడత నవంబర్ 3వ తేదీన 94 సీట్లలో, మూడో విడత నవంబర్ 7వ తేదీన 78 సీట్లకు ఎన్నికలు జరగడంతో.. ప్రక్రియ ముగియనుంది. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.

English summary
latest estimate of the periodic labourer force survey conducted by the national statistical office. july 2018 and june 2019 bihar saw one of the country highest youth unemployment rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X