వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వారంటైన్ ముగిసిన వెంటనే ఉచిత కండోమ్స్ ఇస్తున్నారు: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న లక్షలాది మంది వలస కార్మికులు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌ లేదా హోం క్వారంటైన్లో ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ 14 రోజుల అనంతరం వారిని వారి సొంత గ్రామాలకు పంపిస్తోంది.

 తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ఉచితంగా కండోమ్స్..

ఉచితంగా కండోమ్స్..

ఈ నేపథ్యంలో అనుకోని గర్భధారణ రాకుండా క్వారంటైన్ నుంచి వెళుతున్న వలస కూలీలకు ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను అందిస్తోంది. ఇప్పటికే 8.77 లక్షల మంది క్వారంటైన్ ముగించుకుని వారి వారి ఇళ్ళకు బయల్దేరారు.
ఇంకా 5.30 లక్షల మంది వలస కార్మికులు బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లోనే ఉన్నారు.

అందుకే ఇలా..

అందుకే ఇలా..


14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ముగిసిన క్రమంలో వలస కూలీలు వారి ఇళ్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అనుకోని గర్భధారణలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటిని అరికట్టేందుకు కూలీలకు కండోమ్స్ లాంటివి ఉచితంగా అందజేస్తున్నమని ఆరోగ్య శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కరోనా కోసం కాదు..

కరోనా కోసం కాదు..

కుటుంబ నియంత్రణ కోసం ఇలా చేస్తున్నామని, కరోనావైరస్ గురించి కాదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జనాభాను నియంత్రణలో ఉంచడం తమ విధి అని ఆరోగ్యాధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్య భాగస్వామి అయిన కేర్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అనుకోని గర్భధారణ వచ్చే అవకాశం ఉండటంతోనే ఇలా చేస్తున్నామని చెప్పారు.

ఒక్కొక్కరికి రెండు ప్యాకేట్లు..

ఒక్కొక్కరికి రెండు ప్యాకేట్లు..

క్వారంటైన్ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జూన్ 15 వరకు వలస కార్మికులందరీ క్వారంటైన్ ముగుస్తుందని అధికారులు తెలిపారు.
క్వారంటైన్ సెంటర్లలో ఇప్పటికే హెల్త్ కో-ఆర్డినేటర్స్ రెండు ప్యాకేట్ల చొప్పున కండోమ్స్ ఇస్తున్నట్లు తెలిపారు. హోంక్వారంటైన్లలో ఉన్నవారిని ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ చేస్తున్నారు. కాగా, బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4049 కరోనా కేసులు నమోదు కాగా, 1313 యాక్టివ్ కేసులున్నాయి. 2414 మంది కోలుకోగా, 64 మంది కరోనా బారిన పడి మరణించారు.

English summary
To prevent unwanted pregnancies, the Bihar government is distributing free condoms to migrant labourers going home after completing 14-day institutional quarantine and those in home quarantine, an official said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X