వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఆరుగురు మృతి చెందారు.

Bihar: Nine bogies of Seemanchal Express derail near Sahadai Buzurg

సోన్పూర్ డివిజన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రమాదానికి గురైన రైలు ఆదివారం వేకువజామున గం.3.52 నిమిషాలకు మెహ్‌నార్ దాటిన అనంతరం దాటింది. ఆ తర్వాత గం.3.58 నిమిషాలకు షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు స్లీపర్ కోచ్‌లు (ఎస్8, ఎస్9, ఎస్10)లు, ఒక జనరల్ కోచ్, ఒక ఏసీ (బీ3) కోచ్ సహా మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి.

విషయం తెలియగానే అధికారులు, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సోన్పూర్, బారౌనీ ప్రాంతాల నుంచి వైద్యులు ప్రమాదస్థలికి వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. సోన్పూర్‌ - 06158221645, హజీపూర్‌ - 06224272230, బరౌనీ - 06279232222.

రైలు ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.

English summary
Nine bogies of the Jogbani - Anand Vihar Terminal Seemanchal Express were derailed in Bihar's Sahadai Buzurg in the early hours of Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X