వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గుతోన్న నితీశ్ ప్రజాధరణ..అయినా, సీఎం రేసులో రెండో ప్లేస్‌లో తేజస్వి.. చిరాగ్ 5 శాతమే..

|
Google Oneindia TeluguNews

బీహర్ ప్రజల మూడు మారుతోందా..? వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై లోక్‌నితీ-సీఎస్‌డీఎస్ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. అయితే ఇందులో నితీశ్ కుమార్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. నితీశ్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం 28 శాతానికి చేరిందని సర్వేలో తేలింది.

ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్

ఒపినీయన్ పోల్..

ఒపినీయన్ పోల్..

బీహర్ ప్రజల నాడీ తెలుసుకునేందుకు లోక్ నీతి ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్వే చేపట్టింది. నితీశ్ ప్రభుత్వం.. ఎన్డీఏ కూటమిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అంతేకాదు జనం ఎందుకు నితీశ్ పాలనపై విసుగెత్తిపోయారనే అంశాన్ని కూడా చర్చించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. వరసగా మూడుసార్లు సీఎం పదవీ చేపట్టడంతో ప్రజల్లో వ్యతిరేకత... 42 నుంచి 43 శాతానికి చేరింది.

 అంశాల వారీగా వివరాలు

అంశాల వారీగా వివరాలు

బీహర్ ఎన్నికల్లో 29 శాతం అభివృద్ది, నిరుద్యోగిత 20 శాతం, ద్రవ్యోల్బణం 11 శాతం, పేదరికం 6 శాతం, విద్య 7 శాతం ప్రభావం చూపుతోందని సీఎస్ డీఎస్ సర్వేలో తేలింది. అయితే 30 శాతం మంది బీహరీలో నితీశ్ కుమార్ తదుపరి సీఎంగా ఉండాలని కోరుకున్నారు. ఆర్జేడీ తేజస్వి యాదవ్‌కు 27 శాతం మంది మద్దతు పలికారు. ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతోన్న ఎల్జేపీ చిరాగ్ పాశ్వాన్‌ను కేవలం 5 శాతం మంది తదుపరి సీఎం అయ్యేందుకు అంగీకరించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ.. 4 శాతంతో సరిపెట్టుకున్నారు.

Recommended Video

#RamVilasPaswan : National Flag Flies At Half Mast, Tribute To Legend || Oneindia Telugu
20 శాతం మంది ఇలా..

20 శాతం మంది ఇలా..

20 శాతం మంది మాత్రం ఎన్డీఏకు అధికారం ఇవ్వాలా వద్దా అంశాన్ని తేల్చలేదు. అలా అయితే సీఎం పదవీ రేసులో ఉన్న తేజస్వి యాదవ్.. సుశీల్ కుమార్ మోడీ కలిసినా... కూటమి ఏర్పడేందుకు తగిన బలం సంపాదించలేకపోతారు. 2015లో 80 శాతం మంది ప్రజలు నితీశ్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అదీ ఇప్పుడు 52 శాతానికి చేరింది.

English summary
Lokniti-CSDS Bihar Opinion Poll: anti-incumbency factor is working against Chief Minister Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X