వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లో హనీప్రీత్!? 30 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు.. తీరా చూస్తే..

గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇన్సాన్ బీహార్‌ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీహార్ గుండా పశ్చిమ బెంగాల్ వెళుతున్న ఓ బీఎండబ్ల్యూ కారును 30 క

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పట్నా: ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇన్సాన్ కోసం రాష్ట్రాలన్నీ జల్లెడ పడుతున్నారు. నేపాల్‌ పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.

డేరాలో అంతేలేని ఘోరాలు: అమ్మాయిల అక్రమ రవాణా, విచ్చలవిడి వ్యభిచారండేరాలో అంతేలేని ఘోరాలు: అమ్మాయిల అక్రమ రవాణా, విచ్చలవిడి వ్యభిచారం

ఈ నేపథ్యంలో ఆమె బీహార్‌ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారులో హనీప్రీత్ సింగ్ ఉందనే సమాచారం అందడంతో వారు ఆ కారును వెంబడించారు.

Bihar Police Chase BMW Suspected To Be Of Honeypreet

సుమారు 30 కిలోమీటర్లపాటు సాగిన ఛేజింగ్ అనంతరం కారును అడ్డగించగా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి ఫోర్బెస్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. అయితే చివరకు ఆమె హనీప్రీత్‌ కాదని తేలింది.

పట్టేశారు: హనీ ప్రీత్ సింగ్ ఆచూకీ లభ్యం, వేషం మార్చి.. ఖాట్మాండూలో, కరెక్ట్ లొకేషన్ గుర్తింపు..పట్టేశారు: హనీ ప్రీత్ సింగ్ ఆచూకీ లభ్యం, వేషం మార్చి.. ఖాట్మాండూలో, కరెక్ట్ లొకేషన్ గుర్తింపు..

ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ కారులో ఉన్న ఓ అందమైన మహిళను చూసిన ధరానా ప్రాంత స్థానికులు హనీప్రీత్‌ లాగ ఉందే అనుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారట.

దీంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై తప్పు తెలుసుకుని వదిలేశారు. అయితే ఆ ఛేజ్‌ సాగినంతసేపు స్థానిక మీడియాల్లో హనీప్రీత్ అరెస్ట్ అయిందని కథనాలు ప్రసారం కావటం విశేషం. కాగా, పట్నాకు చెందిన యువతి తన కుటుంబ సభ్యుడితో కలిసి వెళ్తుండగా ఇలా పోలీసులకు చిక్కి ఇబ్బందుల పాలయ్యింది.

English summary
Bihar police have chased a speeding BMW suspected upto 30 kilometers to be of rape convict, Gurmeet Singh's adopted daughter, Honeypreet. According to the information what police received this incedent was happened. First police taken both who are travelling in the BMW into their custody, after knowing that she is not Honeypreet Singh, they left them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X