వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఊపు -వెస్ట్ బెంగాల్‌పై చూపు -ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠభరితంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. దశాబ్దాల తరబడి అధికారాన్ని పంచుకున్న రెండు ప్రాంతీయ పార్టీలు జేడీయూ, ఆర్జేడీ.. 46ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్(ఎంఎల్ -లిబరేషన్) తర్వాత బీహార్ లో ఆరో అతిపెద్ద పార్టీగా అతి పెద్ద పార్టీగా 'ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' అవతరించింది. సీమాంఛల్ ప్రాంతంలో ఆ పార్టీ ఏకంగా 5 సీట్లను సాధించింది. ఓవరాల్ ఫలితాల్లో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ లభించడంతో నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించే అవకాశం చేజారినా.. బీహార్ ఇచ్చిన ఊపుతో..

బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్బీహార్ ఫలితాల్లో సంచలనం: మజ్లిస్ పార్టీకి 5సీట్లు -నిర్ణాయక శక్తిగా ఓవైసీ -కట్టర్ కామెంట్లకు కౌంటర్

ఎంఐఎంకు భారీగా పెరిగిన ఓట్లు

ఎంఐఎంకు భారీగా పెరిగిన ఓట్లు


ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాతి ఏడాది(2022లో) రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. బీహార్ ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి పరంగా తీవ్రమైన వెనుకబాటు కలిగిన సీమాంఛల్ ప్రాంతంలో న్యాయం కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలు పోరాటం కొనసాగిస్తారని చెప్పారు. ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ, మాయావతి బీఎస్పీలతో కలిసి పొత్తుపెట్టుకున్న ఎంఐఎం.. బీహార్ లో మొత్తం 20 చోట్ల పోటీచేయగా 5 స్థానాల్లో గెలిచింది. ఓవరాల్ గా మజ్లిస్ పార్టీకి 2020లో 1.24 శాతం ఓట్లు దక్కాయి. అదే 2015లో వీళ్లకు కేవలం 0.5శాతం ఓట్లు వచ్చాయి. అయితే..

దుబ్బాక ఫలితంపై ఈసీ డిక్లరేషన్ -రఘునందన్ మెజార్టీ మారింది -0.7% తేడాతో టీఆర్ఎస్ ఓటమిదుబ్బాక ఫలితంపై ఈసీ డిక్లరేషన్ -రఘునందన్ మెజార్టీ మారింది -0.7% తేడాతో టీఆర్ఎస్ ఓటమి

ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఓవైసీ సంచలన వ్యాఖ్యలు


తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి గెలవడానికి, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి ఎంఐఎం ఓట్ల చీలికనే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఐఎం గనుక బీజేపీ బీ-టీమ్ బరిలోకి దిగకుంటే ఫలితాలు వేరేలా ఉండేవని అధిర్ రంజన్ చౌదరి(లోక్ సభలో కాంగ్రెస్ నేత), ఎంఎంఐం లాంటి మతతత్వ పార్టీ ఎదుగుదల దేశానికి నష్టదాయకమని మరో కాంగ్రెస్ నేత పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి సమాధానమిస్తూ ఓవైసీ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోటీకి పర్మిషన్ తీసుకోవాలా?

పోటీకి పర్మిషన్ తీసుకోవాలా?

‘‘పొద్దున లేచింది మొదలు మమ్మల్ని(ఐఏఎంఐఎం) బీజేపీ బీ-టీమ్ అని, సెక్యూలర్ ఓట్లను చీల్చేసే ఓట్ కట్టర్లని, మతతత్వ పార్టీ అని దాదాపు అన్ని పార్టీల వాళ్లూ విమర్శిస్తుంటారు. ఎవరు ఎవరి ఓట్లను చీల్చారో, జాతీయ పార్టీగా చెప్పుకునేవాళ్ల సత్తా ఏమిటో బీహార్ ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లమైంది. బీజేపీకి ఫాయిదా చేస్తున్నారని మమ్మల్ని నిందించడంలో అర్థమేంటి? మేం ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ నుంచో, మరో పార్టీ నుంచో పర్మిషన్ తీసుకోవాలా? అసలు ఒక రాజకీయ పార్టీ మరొకరిని ‘ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు?'అని ప్రశ్నించవచ్చా? అవును...

వెస్ట్ బెంగాల్, యూపీ బరిలోకి..

వెస్ట్ బెంగాల్, యూపీ బరిలోకి..

భారత పౌరుడిగా, రాజ్యాంగం నాకిచ్చిన హక్కుల మేరకు దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా. ఇవాళ బీహార్ లో గెలిచారం.. రేపు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం బరిలోకి దిగుతుంది. 2020లో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. బీహార్ లో ఆర్ఎస్ఎల్పీ-బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లే.. బెంగాల్, యూపీలోనూ పొత్తులు పెట్టుకోవాలా, వద్దా, ఒకవేళ పెట్టుకుంటే ఎవరితో కలవాలి అనే విషయాలను కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఏఐఎంఐఎంను పోటీ చేయొద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని గ్రహించాలి. మరీ ముఖ్యంగా..

Recommended Video

#BabriMasjidVerdict : మసీదు దానికదే కూలిందా? హిట్ అండ్ రన్ కేసు : Prakash Raj || Oneindia Telugu
శివసేనతో పొత్తును ఏమంటారు?

శివసేనతో పొత్తును ఏమంటారు?

జాతీయ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా మమ్మల్ని బీజేపీ బీ-టీమ్ అని, సెక్యూలర్ ఓట్ కట్టర్ అని ఎద్దేవా చేస్తోంది. మరి మహారాష్ట్రలో వాళ్లు(కాంగ్రెస్) శివసేనతో పెట్టుకున్న పొత్తును ఏమనాలి? శివసేన సెక్యులర్ పార్టీనా? బాబ్రీ విధ్వంసంలో సేన ప్రమేయం లేదా? శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు చదివితే శివసేన ఎంత సెక్యులరో ఇట్టే అర్థమైపోతుంది. అందుచేత కాంగ్రెస్ గానీ, మరొకరుగనీ మమ్మల్ని నిందించడం మానేసి తమ ప్రదర్శనపై ఫోకస్ పెంచుకోవడం మంచింది. బీహార్ లో 70 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 19 చోట్ల గెలిచి, మహాకూటమి పరాజయంలో తానెంత పాత్ర పోషించానో కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. మమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయొద్దనే హక్కు ఎవరికీ లేదు'' అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

English summary
Buoyed by the results of Bihar assembly elections, the AIMIM which bagged five seats is now looking to spread its wings to states such as Uttar Pradesh and West Bengal.Addressing media, MIM's president Asaduddin Owaisi said the party will fight for justice inthe eastern state's Seemanchal region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X