వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేజస్వీ యాదవ్‌కి పట్టం కట్టిన సోషల్ మీడియా.. నితీశ్ కుమార్ కన్నా 9 రెట్ల ఫాలొవర్లు ఎక్కువ

|
Google Oneindia TeluguNews

ప్రజలకు ఏదీ చెప్పాలన్న సోషల్ మీడియా వేదిక అవుతోంది. దానిని కొందరు రాజకీయ నేతలు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారు. 2014కి ముందు ప్రధాని మోడీ కూడా అలానే వాడి.. అధికారంలోకి వచ్చారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ గురించి చర్చ జరుగుతోంది. అయితే నితీశ్ కన్నా తేజస్వీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. తేజస్వీని నితీశ్ కన్నా 9 రెట్లు ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఆ వివరాలెంటో చుద్దాం.

1.5 మిలియన్ ఫాలొవర్లు..

1.5 మిలియన్ ఫాలొవర్లు..

రాష్ట్రానికి వలసకూలీల తిరిగి రాక, నిరుద్యోగం, వైరస్ లాంటి కఠిన సమస్యలు ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. నితీశ్, తేజస్వీకి కలసి 1.5 మిలియన్ ఫాలొవర్లు ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ఎన్నికల తేదీని ప్రకటించిన సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు యూజర్ల అభిప్రాయాలను ‘ఇండియా టుడే' డాటా ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) సేకరించింది. అయితే అందులో యూజర్ల తేజస్వీ అంటేనే ప్రేమ చూపించారు.

3.7 లక్షల లైక్స్..

3.7 లక్షల లైక్స్..

ఈ నెల రోజుల్లో నితీశ్ కుమార్ 67 పోస్టులను ఫేస్ బుక్‌లో చేశారు. దీనికి 3.7 లైక్స్ వచ్చాయి. అదే తేజస్వీ యాదవ్ 94 పోస్టులు చేయగా.. 47 లక్షల లైక్స్ వచ్చాయి. అయితే పొలిటికల్ పోస్టులను మాత్రమే పరిగణలోకి తీసుకొని రివీల్ చేశారు. బర్త్ డే గ్రీటింగ్స్, సంతాపం లాంటి పోస్టులను డీఐయూ పరిగణలోకి తీసుకోలేదు. రాజకీయ పోస్టులను లెక్కగట్టారు. నితీశ్ ఒక్క పోస్టుకు 5 వేల 572 లైక్స్ రాగా.. తేజస్వీ ఒక్కో పోస్టుకు 51 వేల లైక్స్ వచ్చాయి. అంటే నితీశ్ అంటే తేజస్వీకి 9 రెట్ల ఫ్యాన్ ఫాలొయింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉంది.

16 పోస్టులకు 6 లక్షల లైకులు

16 పోస్టులకు 6 లక్షల లైకులు


ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత నితీశ్ కుమార్ ఫస్ట్ పోస్ట్ ఈ నెల 7వ తేదీన చేశారు. తనకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. అయితే తేజస్వీ మాత్రం ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఎన్నికల తేదీని ప్రకటించిన రోజు.. నాలుగుసార్లు ఎఫ్‌బీ లైవ్‌లో ఉన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపాలని కోరారు. ఈసీ షెడ్యూల్ రిలీచ్ చేసిన తర్వాత చేసిన 16 పోస్టులు 6 లక్షల లైకులు వచ్చాయి. ఇదీ నెలరోజులు నితీశ్‌కు వచ్చిన లైకుల కన్నా రెట్టింపుగా ఉంది. ఆ తర్వాత వారం వారం తేజస్వీ లైకులు పెరుగుతున్నాయి.

Recommended Video

Bihar Elections Phase 1 : ఆర్ధికాంశాల ప్రభావంతో తమ ఓటును నిర్ణయించబోతున్నబీహారీలు...!!
క్యాటగిరీల వారీగా..

క్యాటగిరీల వారీగా..

అయితే లైకులతో పాటు లవ్, హాహా, కేర్, శాడ్, యాంగ్రీ, వావ్ క్యాటగిరీలలో నితీశ్, తేజస్వీని పోల్చారు. ఇందులో తేజస్వీకి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. 35 శాతం మంది తేజస్వీ లవ్ చూపించారు. హాహా 93 శాతం మంది లైక్ చేయడం విశేషం. తర్వాత కేర్, వావ్, శాడ్ ఉన్నాయి.

English summary
September 25-October 25, Nitish made 67 Facebook posts that garnered him 3.7 lakh likes, while Tejashwi received 47 lakh likes from 94 posts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X