వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్: మాంఝీతో సర్దుబాటు, 160సీట్లలో బిజెపి పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేలోని పార్టీల మధ్య సీట్ల పంపకం సోమవారం నాడు కొలిక్కి వచ్చింది. తాజాగా, అధికారికంగా బిజెపి 160 సీట్లలో పోటీ చేయనుంది.

సీట్ల పంపకంలో ఒప్పందం కుదిరిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మూడొంతుల సీట్లలో మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీఏ మద్దతుతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ భారీగా నిధులు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌వి కాలం చెల్లిన అభివృద్ధి విధానాలన్నారు.

 Bihar polls: NDA announces seat shares, BJP will contest 160 seats

అక్టోబరులో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, మాజీ ముఖ్యమంత్రి మాంఝీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 243 స్థానాలున్న బీహార్‌లో బిజెపి 160 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎల్జేపీ 40 స్థానాలు, మాంఝీ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

కుష్వాహా సారథ్యంలోని పార్టీ 23 స్థానాల్లో పోటీ చేస్తుందని అమిత్‌ షా చెప్పారు. అంతకుముందు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) నేత జీతన్‌ రామ్ మాంఝీతో భేటీ అయ్యారు.

ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు.. బీజేపీ, ఎల్జేపీ, ఆర్‌ఎస్‌ఎల్పీ, హెచ్‌ఏఎం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - 160, ఎల్జేపీ - 40, ఆర్‌ఎస్‌ఎల్పీ - 23, హెచ్‌ఏఎం - 20 సీట్లలో పోటీ చేయనున్నాయి.

English summary
It is now official and the BJP will contest 160 seats in the forthcoming Bihar elections. Announcing the seat sharing arrangement in New Delhi, BJP's national president Amit Shah said that BJP will fight 160 seats, LJP, 40, RLSP 23 and HAM 20 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X