వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాక్రేలను వెంటాడుతున్న సుశాంత్ మృతి కేసు..బీహార్‌ ఎన్నికల్లో శివసేన సత్తా చాటుతుందా..?

|
Google Oneindia TeluguNews

బీహార్ ఎన్నికలు క్రమంగా వేడి పుట్టిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో తాము కూడా పోటీచేస్తామంటూ శివసేన ప్రకటించింది. ఇక ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని శివసేన భావిస్తోంది. ఇందుకోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, మంత్రి ఆదిత్య థాక్రేలు రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్లుగా వీరిద్దరూ నిలువనున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు ఇటు బీహార్‌ను అటు మహారాష్ట్రను కుదిపేసిన నేపథ్యంలో బీహార్‌లో ఎంతవరకు శివసేన సక్సెస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

జస్టిస్ ఫర్ సుశాంత్ క్యాంపెయిన్‌లో భాగంగా మహారాష్ట్ర యువనేత మంత్రి ఆదిత్య థాక్రేను నెటిజెన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సుశాంత్ సింగ్ మృతి కేసు సెగ మంత్రి ఆదిత్య థాక్రేకు తగిలింది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య థాక్రే చెప్పారు. సుశాంత్ సింగ్ మృతితో మహారాష్ట్రలోని ఒక యువ మంత్రికి సంబంధం ఉందంటూ బీజేపీ నాయకులు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆదిత్యా థాక్రేను నెటిజెన్లు టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌లను ఖండించిన ఆదిత్య థాక్రే ఇలాంటి చిల్లర రాజకీయాలపై మండిపడ్డారు. బీజేపీ అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేక థాక్రే కుటుంబంపై ఇలాంటి చిల్లర రాజకీయాలు, బురద జల్లే కార్యక్రమాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

Bihar Polls: Shivsena to contest in 50 seats, Uddhav and Aditya Thackeray to campaign

ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో సీఎం ఉద్ధవ్ థాక్రే మరియు ఆదిత్య థాక్రేలు ఆన్‌లైన్ ద్వారా ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మూడు దశల్లో జరగనున్న బీహార్‌ ఎన్నికల్లో శివసేన పార్టీ 50 సీట్లలో పోటీచేయనుంది. ఉద్ధవ్ థాక్రే మరియు ఆదిత్య థాక్రేలు బీహార్ ఎన్నికల ప్రచారంలో శివసేన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారని శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతేకాదు ఎంపీ సంజయ్ రౌత్ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు. కరోనా సమయంలో వీరంతా వర్చువల్ క్యాంపెయినింగ్‌లో పాల్గొంటారని వెల్లడించారు.

Recommended Video

US Election 2020 : Donald Trump vs Joe Biden, ప్రెసిడెంట్ పోల్స్‌లో ముందువరసలో ఉన్నది ఆయనే!

ఇక థాక్రేల, సంజయ్ రౌత్‌లతో పాటు, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, ప్రియాంక చతుర్వేదిలు కూడా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, కృపాల్ తుమనే, వినాయక్ రౌత్‌లతో పాటు మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైర్, రాష్ట్ర మంత్రులు సుభాష్ దేశాయ్, గులాబ్‌రావు పాటిల్‌ పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాజస్థాన్‌ నుంచి శివసేన పార్టీ నేత రాజ్‌కుమార్ బఫ్నా, పంజాబ్ నుంచి యోగ్‌రాజ్ శర్మలు కూడా ప్రచారంలో పాల్గొంటారని శివసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary
Aaditya Thackeray and Uddhav Thackeray are expected to hold virtual rallies to campaign for the party. The Sena is expected to contest around 50 seats in the three-phase election starting on October 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X