వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త శాఖలు సమానంగా: ముఖ్యమంత్రి వద్దే హోమ్: బీజేపీకి ఝలక్: ఫైనాన్స్‌తో సరి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బిహార్‌లో కొత్తగా కొలువు తీరిన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కీలకమైన శాఖలను ఎన్డీఏ మంత్రులకు ఇవ్వలేదని చెబుతున్నారు. ఒక్క ఆర్థికశాఖను మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కమలనాథులు ఆశించిన విధంగా శాఖల పంపకాలు చోటు చేసుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమతౌల్యాన్ని కనపర్చలేదని చెబుతున్నారు.

కోహ్లీసేన మాస్ ఎయిర్ లిఫ్ట్: టీమిండియా సిరీస్‌పై అనుమానాలు: టెస్టులు రద్దవుతాయా?: కారణం ఇదేకోహ్లీసేన మాస్ ఎయిర్ లిఫ్ట్: టీమిండియా సిరీస్‌పై అనుమానాలు: టెస్టులు రద్దవుతాయా?: కారణం ఇదే

సొంత పార్టీ జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు శాఖల కేటాయింపులో సమానత్వం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉండే శాఖలు హోమ్, ఆర్థికం. ఈ రెండింట్లో ఒకటి తన వద్దే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. హోమ్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తారు. ఆర్థికశాఖను బీజేపీకి కేటాయించారు.

 Bihar portfolio allocation: Nitish Kumar keeps Home, GAD and Vigilance

బీజేపీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన తార్ కిషోర్ ప్రసాద్‌కు ఆర్థికశాఖను అప్పగించారు. పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖలను బీజేపీకే చెందిన మరో డిప్యూటీ సీఎం రేణూ ప్రసాద్‌కు ఇచ్చారు. శాఖల కేటాయింపు ఇలా ఉంది: నితీష్ కుమార్- సాధారణ పరిపాలన, హోమ్, మంత్రివర్గ వ్యవహారాలు, విజిలెన్స్, ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు, తార్ కిషోర్ ప్రసాద్-ఆర్థికం, వాణిజ్యం, పన్నులు, పర్యావరణం, అడవులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, రేణూదేవి-పంచాయతీ రాజ్, వెనుకబడిన వర్గాల సంక్షేమం, పరిశ్రమలు ఇచ్చారు.

Recommended Video

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 1న పోలింగ్!

విజయ్ కుమార్ చౌధరీ-గ్రామీణాభివృద్ధి, శాసనసభా వ్యవహారాలు, జల వనరులు, సమాచార శాఖలు, బిజేంద్ర ప్రసాద్ యాదవ్-విద్యుత్, ఎక్సైజ్, ప్రణాళిక అభివృద్ధి, పౌర సరఫరాలు, అశోక్ చౌధరీ-భవన నిర్మాణాలు, మైనారిటీ సంక్షేమం, మేవాలాల్ చౌధురి-విద్య, శీలా కుమారి-రవాణా, సంతోష్ కుమార్ సుమన్-చిన్నతరహా నీటి ప్రాజెక్టులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ముఖేష్ సహనీ-పశు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ, మంగళ్ పాండే-వైద్య, ఆరోగ్యం, సాంస్కృతికం, యువజన సర్వీసులు, రోడ్ల నిర్మాణం, అమరేంద్ర ప్రతాప్ సింగ్-వ్యవసాయం, సహకార శాఖ, చెరకు అభివృద్ధి, డాక్టర్ రామ్ ప్రీత్ పాశ్వాన్-కమ్యూనిటీ హెల్త్ మిషన్లు, జీవన్ కుమార్-కార్మిక శాఖ, పర్యాటకం, గనులు, రామ్ సూరత్ కుమార్-రెవెన్యూ శాఖలను కేటాయించారు.

English summary
Bihar portfolio allocation: Nitish Kumar keeps Home Department, General Administration and Vigilance. Deputy CM Tarkishore Prasad gets Finance, Urban Development, and Deputy CM Renu Devi gets Panchayati Raj, Backward cast upliftment and Industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X