వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"గవర్నర్ కీలు బొమ్మా": వివాదాస్పదంగా మారిన ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం

|
Google Oneindia TeluguNews

బీహార్ : ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పరీక్ష నిర్వహిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే పరీక్షాపత్రంను నిపుణుల పర్యవేక్షణలో సెట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు రూపొందించే ప్రశ్నాపత్రం తయారు చేసే సమయంలో చాలా జాగ్రత్తతతో వ్వవహరిచడం జరుగుతుంది. కానీ బీహార్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ సెట్ చేసే అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపించింది. బీపీఎస్‌సీ విమర్శల పాలవుతోంది.

గవర్నర్ ఒకరి చేతిలో కీలుబొమ్మా అనే ప్రశ్న

గవర్నర్ ఒకరి చేతిలో కీలుబొమ్మా అనే ప్రశ్న

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షలో అడిగిన ప్రశ్నపై ఇటు అభ్యర్థులు అటు పలువురు నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలో గవర్నర్ బాధ్యతలు, గవర్నర్ వ్యవస్థపై అడిగిన ప్రశ్న పలువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ప్రశ్నకు మార్కులు 38. ఇది జనరల్ స్టడీస్ పేపర్-2లో ఇచ్చారు. "రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ వ్యవస్థ ఎలా ఉంటుంది.. ముఖ్యంగా బీహార్‌లో గవర్నర్ వ్యవస్థపై మీ అభిప్రాయం తెలపండి..? గవర్నర్ నిజంగానే ఒకరి చేతిలో కీలుబొమ్మనా..?" అనే ప్రశ్న సంధించడం జరిగింది.

గతంలో ఇద్దరు గవర్నర్ల తీరు వివాదాస్పదం

గతంలో ఇద్దరు గవర్నర్ల తీరు వివాదాస్పదం

గతంలో ఇద్దరు బీహార్ గవర్నర్ల చుట్టూ వివాదం నెలకొంది. 2000వ సంవత్సరంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా... నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు నాటి గవర్నర్ బీసీ పాండే. వాస్తవానికి రబ్రీదేవీ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా అవతరించింది. ఆ సమయంలో నితీష్ కుమార్ బలపరీక్షలో విఫలమయ్యారు. దీంతో ఏడురోజుల్లోనే నితీష్ ప్రభుత్వం పడిపోయింది. ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2005లో కూడా అప్పటి గవర్నర్‌గా ఉన్న బూటా సింగ్ అసెంబ్లీని రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఎన్డీఏ, యూపీఏలు తాము ఎల్‌జేపీ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ వారి వాదనలను పక్కనబెట్టి అసెంబ్లీని రద్దు చేశారు. ఆ సమయంలో నాటి గవర్నర్ బూటా సింగ్ నిర్ణయంను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అదే సంవత్సరంలో మళ్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

 ప్రశ్నాపత్రం సెట్ చేసిన వ్యక్తి సస్పెండ్

ప్రశ్నాపత్రం సెట్ చేసిన వ్యక్తి సస్పెండ్


ఇక ఈ సారి ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నపై బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషిన్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అమరేంద్ర కుమార్ స్పందించారు. ఎలాంటి ప్రశ్నలు అడిగారో తమకు తెలియదని అయితే గవర్నర్ వ్యవస్థపై ప్రశ్న మరోలా అడిగిఉంటే బాగుండేదని చెప్పారు. అయితే ఈ ప్రశ్నాపత్రాన్ని సెట్ చేసిన అధికారిని డీబార్ చేశామని చెప్పారు. అయితే ఈ పరీక్షను తిరిగి నిర్వహించబోమని చెప్పారు. ఇక ఇదే ప్రశ్నతో పాటు మరో ప్రశ్న కూడా వివాదాస్పదంగా మారింది. బీహార్‌లో ఎక్కువ రాజకీయ పార్టీలు ఉండటం శాపమా..? అని అడిగారు.

English summary
The question, in the General Studies Paper II of the Bihar Public Service Commission (BPSC) entrance examination (mains) Sunday, has led to an uproar, resulting in the barring of the person who set the examination paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X