వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election 2020: తొలి దశ ప్రశాంతం - 53.54 శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగింది. నిర్ణీత గడువు ముగిసే సమయానికి మొత్తం 53.54 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌తో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ స్వల్పంగా తగ్గింది. 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో 54.94 శాతం పోలింగ్ నమోదు అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో 53.54 నమోదైంది.

నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవంనన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవం

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తొలి దశలోని 71 నియోజకవర్గాల్లో 53.54 శాతం పోలింగ్ రికార్డయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మారుమూల ప్రాంతాల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని, గురువారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు వెల్లడిస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన తొలి ఎన్నికలు కావడంతో ఈసీ ఈసారి అనూహ్య ఏర్పాట్లు చేసింది.

Bihar records 53.54 per cent polling in first phase: State CEO

చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనంచంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్ - కేంద్రానికి ఏం రాశారో గుర్తుందా?: అంబటి రాంబాబు సంచలనం

Recommended Video

Bihar Elections Phase 1 : ఆర్ధికాంశాల ప్రభావంతో తమ ఓటును నిర్ణయించబోతున్నబీహారీలు...!!

బీహార్ లో గత(2015) అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదు కావొచ్చని అంచనాలున్నాయి. మొదటి దశలో 53.54 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, నవంబర్ 3న జరిగే రెండో దశ, నవంబర్ 7న జరిగే మూడో దశలో పోల్ శాతం పెరిగే అవకాశముంది. నితీశ్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఈసారి ఓటింగ్ శాతం పెరగొచ్చన్న అంచనాలు తప్పని లేలాయి. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనేది నవంబర్ 10న తేలనుంది.

English summary
Bihar recorded a 53.54 per cent polling in the first phase of assembly polls on Wednesday, according to a release by the Chief Electoral Officer Bihar. Polling was held 71 assembly constituencies amid tight security and COVID-19 guidelines in place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X