వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరారియాలో ఆర్జెడీ విజయంపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: బీహార్‌లోని ఆరారియా లోకసభ ఉప ఎన్నికల్లో ఆర్జెడీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారంనాడు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆరారియా జిల్లా ఉగ్రవాద హబ్‌గా మారుతుందని ఆయన వ్యాఖ్యానించార.

ఆరారియా ఫలితం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రమాదకరమని అన్నారు. అది నేపాల్, బెంగాల్ సరిహద్దు ప్రాంతమనే కాదు, దీని తర్వాత సనాతన మనస్తత్వం ఏర్పడిందని, ఇది బీహార్‌కు మాత్రమే కాకుండా దేశానికి కూడా ప్రమాదకరమని అన్నారు.

Bihars Araria will become hub of terror: Union minister reacts on RJD bypoll win

ఆర్జెడీ రెండు మైనారిటీల ఆధిపత్యం గల నియోజకవర్గాల్లో ఆర్జెడీకి లక్షా 30 వేల మెజారిటీ వచ్చిందని, దానివల్ల ఆరారియాలో ఆర్జెడి గెలిచిందని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారంనాడు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను పోస్టు చేశారు.

గిరిరాజ్ సింగ్, సుశీల్ కుమార్ సింగ్ వ్యాఖ్యలను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి తిప్పికొట్టారు. మోడీ మానియా, హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ కేకలు ఆవిరిపోయాయని, అందుకే వారు రెచ్చిపోతున్నారని ఆమె అన్నారు.

గిరిరాజ్ సింగ్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరారియా, బీహార్ ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఆరారియా ప్రజలు వారిని క్షమించరని, ఆరారియా ప్రజల ఉగ్రవాదులా అని ఆమె మండిపడ్డారు.

English summary
Union Minister Giriraj Singh on Thursday said that Araria will soon become a "terror hub".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X