వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ పార్టీకి షాక్: ఆర్జేడీకి కీలక నేత, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దల్(ఆర్జేడీ) కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జేడీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు.
ప్రస్తుతం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచే ఆర్జేడీకీ తన రాజీనామా లేఖను పంపారు.

సాధారణ కాగితంపైనే ఆయన తన రాజీనామా లేఖను రాయడం గమనార్హం. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'జననాయక్ కర్పూరి ఠాకూర్ మరణం తర్వాత నేను సుమారు 32ఏళ్లపాటు మీతో ఉన్నాను. కానీ, ఇప్పుడు లేను నేను పార్టీ నేతలు, కార్యకర్తలు మంచి సంబంధాలను కలిగివున్నాను. నన్ను క్షమించాలి' అంటూ తన లేఖలో ప్రసాద్ పేర్కొన్నారు.

 Bihar: Senior RJD leader Raghuvansh Prasad Singh resigns from party

గత జూన్ నెలలోనే ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి ప్రసాద్ రాజీనామా చేశారు.
కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు చికిత్స నిమిత్తం వెళ్లారు. బుధవారం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)కు తరలించారు.

బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి ప్రసాద్ యాదవ్‌ను ప్రకటించాలని పార్టీ నేతల నుంచి, గ్రాండ్ అలియన్స్ నేతల నుంచి వస్తున్న ఒత్తిడిని ఆయన వ్యతిరేకించారు. ఆర్జేడీ పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న రఘువంశ్ ప్రసాద్ చెప్పే విషయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, పలుమార్లు రాజ్యసభ సీటు కేటాయించేందుకు కూడా విముఖత చూపడం లాంటి అంశాలు ఆయన తాజా నిర్ణయానికి కారణాలుగా తెలుస్తున్నాయి.

Recommended Video

Rain Fall Across Country ఈ సీజన్‌ మొత్తం 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : IMD || Oneindia

తన రాజకీయ ప్రత్యర్థి అయిన రామ సింగ్‌ను ఆర్జేడీలో చేర్చుకోవడంతో జూన్ 23న పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి రఘువంశ్ తప్పుకున్నారు. కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రఘువంశ్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల అభివృఆయన ఎంతో కృషి చేశారు. ఉత్తమ కేంద్రమంత్రిగా ఆయన యూపీఏ హయాంలో పేరు పొందారు.

English summary
Rashtriya Janta Dal (RJD) senior leader and former Union Minister Raghuvansh Prasad Singh has resigned from the party on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X