వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత జవాబులు: బీహార్‌ టాపర్‌ రూబీరాయ్‌ అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన టాపర్‌ స్కాంలో ఆర్ట్స్‌ విభాగం టాపర్‌ రూబీరాయ్‌ని ఆదివారం అరెస్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. మోసం చేసి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ఆరోపణలతో ఆమెను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అదుపులోకి తీసుకుంది.

బీహార్‌లో ఇటీవల విడుదలైన 12వ తరగతి ఫలితాలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన అనంతరం పలు విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారితో ఓ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూ నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టాపర్లకు కనీస విషయ పరిజ్ఞానం లేదని ఈ ఇంటర్వ్యూలో తేలింది. పొలిటికల్‌ సైన్స్‌(రాజనీతిశాస్త్రం) గురించి రూబీరాయ్‌ని అడిగిన ప్రశ్నకు.. అది వంటలకు సంబంధించిన విషయమని జవాబిచ్చింది. మరో సైన్స్‌ టాపర్‌ ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఈ విషయం కాస్తా వివాదస్పదంగా మారి.. పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి.

దీంతో బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్టు టాపర్లకు మరోసారి పరీక్ష నిర్వహించగా.. రూబీరాయ్‌ హాజరుకాలేదు. ఈ విషయమై బోర్డు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఆమెకు సమన్లు పంపింది. దీంతో శనివారం ఆమె కమిటీ ఎదుట హాజరైంది. రూబీని పరీక్షించిన నిపుణుల కమిటీ.. ఆమె ఫలితాలను రద్దు చేసింది. అనంతరం ఆమెను ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ అరెస్ట్ చేసింది.

రూబీ రాయ్

రూబీ రాయ్

బీహార్‌లో వివాదాస్పదంగా మారిన టాపర్‌ స్కాంలో ఆర్ట్స్‌ విభాగం టాపర్‌ రూబీరాయ్‌ని అరెస్టు చేశారు పోలీసులు.

రూబీ రాయ్

రూబీ రాయ్

మోసం చేసి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ఆరోపణలతో ఆమెను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అదుపులోకి తీసుకుంది.

రూబీ రాయ్

రూబీ రాయ్

బీహార్‌లో ఇటీవల విడుదలైన 12వ తరగతి ఫలితాలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన అనంతరం పలు విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారితో ఓ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూ నిర్వహించగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూబీ రాయ్

రూబీ రాయ్

టాపర్లకు కనీస విషయ పరిజ్ఞానం లేదని ఈ ఇంటర్వ్యూలో తేలింది. పొలిటికల్‌ సైన్స్‌(రాజనీతిశాస్త్రం) గురించి రూబీరాయ్‌ని అడిగిన ప్రశ్నకు.. అది వంటలకు సంబంధించిన విషయమని జవాబిచ్చింది.

English summary
Ruby Rai, the controversial topper in Arts stream of BSEB Exams, who appeared before the Bihar School Examination board officials was arrested today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X