వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తతో విభేదాలు, ప్రియుడితో వివాహనికి ట్విస్ట్: యువతి సాహసం

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొనేందుకు ఓ యువతి తన కిడ్నీనే విక్రయించాలని భావించింది. అయితే ప్రియుడిని వివాహం చేసుకొనేందుకు వరకట్నం ఇచ్చేందుకు యువతి తన కిడ్నిని విక్రయించేందుకు సిద్దమైంది.

బిహార్‌కు చెందిన యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఇటీవల పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి అతడిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అందుకు వారు అంగీకరించలేదు.

అయినా మనసు మార్చుకోని యువతి అతడితో వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రేమించిన వాడు మాత్రం కట్నం లేకుండా పెళ్లి కుదరదని తెగేసి చెప్పేశాడు. దాదాపు రూ.2 లక్షలు కట్నంగా ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. పెళ్లికే అంగీకరించని తల్లిదండ్రులు, అంత కట్నం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించడంతో యువతి అయోమయంలో పడింది. చివరికి తన కిడ్నీని అమ్మడం ద్వారా ప్రియుడు అడిగిన డబ్బులు సమకూర్చుకోవాలని భావించి ఢిల్లీకి పయనమైంది.

దేశ రాజధానిలోని ఓ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తాను కిడ్నీ దానం చేయాలని అనుకుంటున్నట్టు వైద్యులకు తెలిపింది. అయితే వైద్యులు మాత్రం ఆమె కిడ్నీ అమ్మడానికే వచ్చినట్టు అనుమానించి మహిళా కమిషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతి చెప్పింది విని నివ్వెరపోయారు.

Bihar woman travels to Delhi to sell kidney after lover seeks money for marriage

ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రియుడిపై ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అయితే కిడ్నీ అమ్మాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన ఆమె ప్రియుడిపై కేసు పెట్టేందుకు నిరాకరించి తిరిగి బిహార్ వెళ్లిపోయింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ కేసు వివరాలను బిహార్ మహిళా కమిషన్‌కు పంపి యువతికి సాయం అందించాల్సిందిగా కోరింది. అలాగే యువతి ప్రియుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.
English summary
A 21-year-old woman from Bihar came to New Delhi to sell one of her kidneys so that she could pay her boyfriend, who demanded the money before marrying her, an official of the Delhi Commission for Women (DCW) said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X