వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపూర్‌లో త్రిముఖ పోటీ: సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీమణే బీజేడీ అభ్యర్థి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బీజేపూర్: ఒడిశాలో బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 24వ తేదీన జరిగే ఉప ఎన్నిక పోరు త్రిముఖ పోటీ కానున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ), కేంద్రంలోని అధికార బీజేపీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణయ్ సాహు ఆదివారం సామాలేశ్వరి ఆలయంలో పూజలతో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మరోవైపు అధికార బీజేడీ అభ్యర్థి రితా సాహు సీనియర్ నేతలతో కలిసి అగల్పూర్‌లో ఇంటింటికి ప్రచారం చేశారు.
బీజేడీ వర్గాల కథనం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థి రితా సాహు తరఫున సీఎం నవీన్ పట్నాయక్ ఈ నెల 19, 21 తేదీల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. గత ఆగస్టులో మరణించిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబాల్ సాహు సతీమణి రీతా సాహును పార్టీలో చేర్చుకున్న నవీన్ పట్నాయక్ తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు.
గైసిలాట్, బార్పల్లి బ్లాక్‌ల్లో 19న, బీజేపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ సభల్లో నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అశోక్ పాణిగ్రాహి తరఫున బీజేపీఎల్పీ నేత కేవీ సింగ్ దేవ్ ఆదివారం గైసిలాట్ లోని మహారాపల్లిలో ప్రచారం చేశారు. మూడు పార్టీల తరఫున అగ్ర నేతలు బీజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముంచెత్తనున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 24న పోలింగ్ జరుగుతుండగా, 28న ఫలితాలు వెలువడతాయి.

వచ్చే ఏడాది అసెంబ్లీ ప్లస్ లోక్‌సభ ఎన్నికలు జరగడమే ప్రాధాన్యం

వచ్చే ఏడాది అసెంబ్లీ ప్లస్ లోక్‌సభ ఎన్నికలు జరగడమే ప్రాధాన్యం

కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలంతా బారులు తీరాల్సిన అవసరమేమిటంటే.. వచ్చే ఏడాది మే నెలలో లోక్‌సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటం.. ఒడిశాలోని అధికార బీజేడీలో కుమ్ములాటలు.. మూడోసారి విజయవంతంగా పరిపాలన పూర్తి చేసుకుంటున్న నవీన్ పట్నాయక్ నాయకత్వానికి సవాళ్లు ముందుకు వస్తున్నాయా? అన్న రీతిలో రాజకీయ పరిస్థితులు మారుతుండటమే దీనికి కారణం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్ఠానం కూడా బీజేపూర్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, జువాల్ ఓరాం, రాధామోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు బీజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముంచెత్తనున్నారు. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ కూడా ప్రచారానికి వస్తారని మాటలు వినిపిస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన ప్రచారకర్తల జాబితాలో ఆయన పేరు లేదు. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్ జీ, కార్యదర్శి సుదాన్ సింగ్, ఒడిశా ఇన్‌చార్జి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, రాం క్రుపాల్ యాదవ్, బాబుల్ సుప్రియో, మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తదితరులు ప్రచారం చేయనున్నారు.

బీజేపీపై ఎన్నికల సంఘానికి బీజేడీ ఫిర్యాదు

బీజేపీపై ఎన్నికల సంఘానికి బీజేడీ ఫిర్యాదు

మరోవైపు రాష్ట్రంలోని అధికార బీజేడీ అభ్యర్థి రీతా సాహు తరుఫున సీఎం నవీన్ పట్నాయక్‌తోపాటు యావత్ రాష్ట్ర క్యాబినెట్ నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నది. మరోవైపు ఏడు రోజుల ముందు ప్రచారకర్తల జాబితాను సమర్పించడంలో బీజేపీ విఫలమైందని బీజేడీ ఆరోపిస్తోంది. అదే జరిగితే అభ్యర్థి ప్రచార ఖర్చులో వీరి ప్రచారానికి అయ్యే ఖర్చు చేరనున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రుల ప్రచార ఖర్చును బీజేపీ అభ్యర్థి ఖర్చులో జమ చేయాలని బీజేడీ అధికార ప్రతినిధి శస్మిత్ పాత్ర, కార్యదర్శి బిజయ్ నాయక్ డిమాండ్ చేశారు. మరోవైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ బీజేపీ, బీజేడీ నేతల మధ్య పరస్పరం ఆరోపణలు, సవాళ్లు పెరుగుతున్నాయి. ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేడీ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు రాష్ట్రమంత్రి స్నేహంగిని చురియా ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనం వాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని బీజేపీ ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నిక అనివార్యం

కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నిక అనివార్యం

బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఒడిశా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సురేంద్ర కుమార్ తెలిపారు. బారాగఢ్ జిల్లా పరిధిలోని ఈ అసెంబ్లీ స్థానం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబాల్ సాహు గత ఆగస్టు 22వ తేదీన మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ఈవీఎంలతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాలను వినియోగిస్తామని కేంద్ర ెన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల పర్యవేక్షకులుగా అభిషేక్ చంద్ర, సుశీల్ కుమార్ యాదవ్‌లను నియమించారు.

English summary
Bijepur: Ahead of the by-election to the Bijepur Assembly constituency on February 24.. BJD, BJP and Congress are all battle-ready and have now kicked off their campaigning one after the other.While Congress candidate Pranay Sahu began campaigning today from Barapali after offering worship to Goddess Samaleswari, BJD candidate Rita Sahu accompanied by senior party leaders was seen campaigning door-to-door in Agalpur. Sources said Chief Minister Naveen Patnaik will campaign for party candidate Rita Sahu in Gaisilat and Barpali blocks on February 19 and in Bijepur block on February 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X