వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది.... ఆపరేషన్లు చేసిన వైద్యుడి అరెస్టు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఛత్తీస్‌గడ్ తరహా ఘటన జరిగింది. ఇటీవలే ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 14 మహిళలు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా కంటి చూపుకోసం 50 మందికి ఆపరేషన్‌లు చేయగా 16 మందికి పూర్తిగా కంటిచూపు పోయింది.

వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఓ ఎన్జీవో నిర్వహించిన ఐ క్యాంపులో ఈ ఘటన జరిగింది. కంటి చూపు కొల్పోయిన వారంతా 60ఏళ్లకు పైబడిన వారు కావడం విశేషం. కంట్లో ఏర్పడిన శుక్లాను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.

చూపు కోల్పోయిన వారిని అమృతసర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చమని, ఉన్నత స్ధాయి విచారణకు ఆదేశించామని అమృతసర్ డిప్యూటీ కమిషనర్ రవి భగత్ తెలిపారు. వైద్యులు తమ టార్గెట్లు పూర్తి చేసేందుకు అత్యుత్సాహం చూపించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో కంటి వైద్య శిబిరంలో కేటరాక్ట్ శస్త్రచికిత్సలు చేసి 16 మంది కంటి చూపు కొల్పోవడానికి కారణమైన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఎన్జీవో పేర్కొంది.

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

జలంధర్‌లోని ఒక ఆసుపత్రి వైద్యులు వివేక్ అరోరా ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసినట్లు గురుదాస్ పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కంటి చూపుకోసం 50 మందికి ఆపరేషన్‌లు చేయగా 16 మందికి పూర్తిగా కంటిచూపు పోయింది.

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఓ ఎన్జీవో నిర్వహించిన ఐ క్యాంపులో ఈ ఘటన జరిగింది. కంటి చూపు కొల్పోయిన వారంతా 60ఏళ్లకు పైబడిన వారు కావడం విశేషం. కంట్లో ఏర్పడిన శుక్లాను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది

చూపు కోల్పోయిన వారిని అమృతసర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చమని, ఉన్నత స్ధాయి విచారణకు ఆదేశించామని అమృతసర్ డిప్యూటీ కమిషనర్ రవి భగత్ తెలిపారు. వైద్యులు తమ టార్గెట్లు పూర్తి చేసేందుకు అత్యుత్సాహం చూపించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

English summary
Just days after a botched up sterilisation camp that claimed the lives of 14 women in Bilaspur, 16 people lost their eye sight after undergoing a surgery in an eye camp in Gurdaspur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X