వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిని రిలీజ్ చేసింది ఇందుకే.. మిమ్మల్ని ముస్లిం సమాజం క్షమించదు, ప్రధాని మోడీపై అసద్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్య కేసు 11 మంది దోషుల విడుదలను ఎంఎఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందుకోసమే దోషులకు విడుదల చేశారని అసద్ ఆరోపించారు. నిన్న ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మహిళకు మరిన్ని అధికారాలు కల్పించామని తెలిపారు. కానీ అదీ మాటలే అని రుజువు అయ్యిందన్నారు. బిల్కిస్ బానో ఇష్యూతో ముస్లిం సమాజానికి తప్పుడు మేసెజ్ వెళుతుందని తెలిపారు.

ఎన్నికల కోసమే..

ఎన్నికల కోసమే..

గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారని అసద్ అన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుందని తెలిపారు. అందుకోసమే ఇలాంటి చర్యలకు పాల్పడిందని తెలిపారు. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో శిక్షపడిన ఖైదీల కోసం విడుదల విధానం ఉండదని.. లైంగికదాడి చేసిన దోషులను విడుదల చేయబోమని జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఆ మార్గదర్శకాలకు కేంద్రం ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

గ్యాంగ్ రేప్.. మర్డర్

గ్యాంగ్ రేప్.. మర్డర్


బిల్కిస్ బానోపై 2002లో సామూహిక అత్యాచారం , హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న నిందితులు 11 మందిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జనవరి 21, 2008న మంబయిలోని స్పెషల్ సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ దోషులు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 రిలీజ్..

రిలీజ్..


పంచమహల్‌ కలెక్టర్‌ సుజల్‌ మయత్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కొన్నినెలల క్రితం మిగతా వారందరినీ రిలీజ్ చేయాలని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా... ఈ 11మంది దోషులందరికీ క్షమాభిక్ష పథకం కింది రిలీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది 'కరసేవకులు' మృతి చెందారు. తరువాత జరిగిన హింసలో.. ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానో పారిపోయింది. పొలంలో దాక్కుని ఉండగా, కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు చనిపోగా.. ఆరుగురు సభ్యులు పారిపోయారు.

English summary
release of 11 men serving life term for gangrape of Bilkis Bano and the murder of her family during the 2002 Gujarat riots, is "appeasement politics" ahead of the state elections in Gujarat, Asaduddin Owaisi told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X