వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్: 11మంది దోషులకు జీవిత ఖైదును సమర్థించిన హైకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు మరణదండన విధించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో 11 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు మరణదండన విధించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో 11 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఈ కేసులో కీలక నిందితులైన జస్వంత్ నాయ్, గోవింద నాయ్‌లకు మరణశిక్ష విధించాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది.

2002లో గోద్రా అల్లర్ల తరువాత అహ్మదాబాద్ సమీపంలోని రాందిక్ పూర్ గ్రామనికి చెందిన బానో ఇంటిలోకి చొరబడిన నిరసనకారులు, నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడి, ఎనిమిది మంది కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేయడం జరిగింది.

Bilkis rape case: HC upholds life imprisonment to 12 convicts

బిల్కిస్ మరో ఇద్దరు మాత్రం బతికి బట్టకట్టారు. అప్పుడు ఆమె వయసు 19ఏళ్లు. ఈ కేసును విచారించిన ముంబై ప్రత్యేక కోర్టు 2008లో తీర్పును వెలువరిస్తూ.. 12 మందిని దోషులుగా తేలుస్తూ.. 11 మందికి యావజ్జీవ శిక్షను విధించింది.

మరో ఏడుగురిని సాక్ష్యాలు లేని కారణంగా వదిలేసింది. తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం కేసు పునర్విచారణ బాధ్యతలను బాంబే హైకోర్టుకు అప్పగించింది.

English summary
The Bombay High Court on Thursday upheld the conviction and life imprisonment of 12 people in the Bilkis Bano gang rape case while setting aside the acquittal of seven persons including policemen and doctors. The court also dismissed an appeal filed by CBI seeking death penalty for three of the convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X