వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు ఎఫెక్ట్:కంబళపై నిషేధం ఎత్తివేస్తూప్రత్యేక చట్టం

జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాాడు అసెంబ్లీ ప్రత్యేక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు తరహలోనే కర్ణాటకలో ఉద్యమం సాగింది.అయితే కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు తరహలోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ మేరకు కంబళ క్రీడపై నిషేధం ఎత్తివేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం బిల్లుకు సోమవారం నాడు ఆ రాష్ట్ర అసెంబ్లీ పచ్చజెండా ఊపింది.

తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఆందోళనలు సాగాయి. మెరీనాబీచ్ వేదికగా చేసుకొని తమిళనాడులో యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

యువత ఆందోళనలతో ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొచ్చింది.తమిళనాడు యువత స్పూర్తితో కర్ణాటకలో కంబాళ ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆందోళనలు సాగాయి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఉద్యమం చేసే ప్రయత్నం సాగింది.అయితే జల్లికట్టు స్పూర్తితోనే ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలకు అంకురార్పణ జరిగింది.

కంబళ అంటే ఏమిటీ?

కంబళ అంటే ఏమిటీ?

కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆటను ఆడుతారు. తీర ప్రాంతాల్లో ఈ పోటీలు సాగుతాయి. దేవుడు తమ పశువులను రోగాల బారిన పడకుండా కాపాడినందుకు గాను ఈ పోటీలసు నిర్వహిస్తారని చెబుతారు.నాగలికి రెండు దున్నపోతులను కట్టి బురద పొలంలో పోటీపడడమే కంబళ క్రీడ.ఎవరు అతి తక్కువ సమయంలో అవతలి గట్టుకు చేరుకొంటారో వారే విజేతలు.ఈ క్రీడలు నవంబర్ లో ప్రారంభమై మార్చిలో ముగుస్తాయి.అయితే జంతువులనను హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దీంతో 2014 లో సుప్రీంకోర్టు జల్లికట్టు, కంబళ పై నిషేధం విధించింది.

సాంప్రదాయ క్రీడ కంబళ

సాంప్రదాయ క్రీడ కంబళ

జల్లికట్టు తరహలోనే కంబళ క్రీడ కూడ సాంప్రదాయమైన క్రీడగా ప్రాచుర్యం పొందింది.ఏళ్ళ నాటి నుండి కర్ణాటక వాసులు ఈ ఆట ఆడుతుంటారు. ఈ ఆట కోసం రైతులు .పోటీలు పడుతుంటారు.2014 లో జల్లికట్టుతో పాటే కంబళ క్రీడపై నిషేధం విధించడంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది.

కంబళ క్రీడకు క్లియరెన్స్

కంబళ క్రీడకు క్లియరెన్స్

కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళపై ఉన్న నిషేధం ఎత్తివేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. కంభళపై ప్రత్యేక చట్టం బిల్లకు సోమవారం నాడు కర్ణాటక అసెంబ్లీ పచ్చజెండా ఊపింది. తమిళనాడు తరహలోనే కర్ణాటకలో ఆందోళనలు సాగిన సమయంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.దీంతో ఇవాళ సోమవారం నాడు ఈ మేరకు కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.

జల్లికట్టు పోరాటమే స్పూర్తి

జల్లికట్టు పోరాటమే స్పూర్తి

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాడులో యువత చేసిన పోరాటమే అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు గాను, పోరాటాలకు స్పూర్తిగా నిలిచింది. జల్లికట్టు పోరాటం ఆధారంగా చేసుకొనే ఇతర రాష్ట్రాల్లో కూడ ఇదే తరహ ఆందోళనలకు సిద్దమయ్యారు.అయితే ప్రభుత్వాలు కూడ ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Paving the way to hold the traditional buffalo race of Kambala unhindered, the Karnataka Assembly on Monday passed the Prevention of Cruelty to Animals (Karnataka Amendment) Bill, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X