వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: హెచ్ 1 బీ వీసాలు పెంచాలని రిపబ్లికన్ల బిల్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రతిభావంతులను అమెరికాకు రప్పించేందుకు ప్రస్తుతం జారీ చేస్తున్న హెచ్ 1 బీ వీసాలను పెంచాలని కోరుతూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు గురువారం నాడు ఓ బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టారు.

హెచ్ 1 బీ వీసాల నిబంధనలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినతరం చేసింది. అమెరికాలోని స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు.

ఈ చట్టం కారణంగా ఇండియాకు చెందిన టెక్కీలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాదు ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై ఈ ప్రభావం కన్పించింది. అయితే తాజాగా రిపబ్లికన్ సెనేటర్లు హెచ్ 1 బీ వీసాల .జారీని పెంచాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు.

 హెచ్ 1 బీ వీసాలను పెంచాలంటూ రిపబ్లికన్ సెనేటర్ల బిల్లు

హెచ్ 1 బీ వీసాలను పెంచాలంటూ రిపబ్లికన్ సెనేటర్ల బిల్లు

ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను అమెరికాకు రప్పించాలని రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు గురవారం నాడు అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం జారీ చేస్తున్న హెచ్ 1 బీ వీసాల సంఖ్యను మరింతగా పెంచాలని వారు సూచించారు.ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ అనే సెనేటర్లు 'ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌( I-‍ స్క్వేర్డ్‌) యాక్ట్‌ 2018 పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు.

టెక్ దిగ్గజ కంపెనీలు ఈ బిల్లుకు మద్దతు

టెక్ దిగ్గజ కంపెనీలు ఈ బిల్లుకు మద్దతు

మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటి టాప్‌ అమెరికన్‌ ఐటీ కంపెనీలు, యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్‌ లాంటి టాప్‌ ట్రేడ్‌ బాడీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పోటీని ఇలానే కొనసాగించడాన్ని ఈ బిల్లు ఎక్కువగా ఫోకస్‌ చేస్తుందని హాచ్, ఫ్లాక్ తెలిపారు.

ప్రతిభావంతులకు హెచ్ 1 బీ వీసా ఉపయోగం

ప్రతిభావంతులకు హెచ్ 1 బీ వీసా ఉపయోగం

హెచ్‌-1బీ ప్రొగ్రామ్‌లో సంస్కరణలు.. మోసపూరితాలను తగ్గించి, వర్కర్లను కాపాడుతుందని, ఎక్కువ ప్రతిభావంతులైన వర్కర్లకు గ్రీన్‌ కార్డు సౌలభ్యాన్ని పెంచుతుందని రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ఎక్కడైతే అమెరికా లేబుర్‌ తక్కువగా ఉంటుందో అక్కడ పరిశ్రమల కోసం హెచ్‌-1బీ వీసా అందుబాటులో రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయంతో ఉన్నారు.

హెచ్ 1 బీ వీసా ఫీజును శిక్షణ కోసం వాడాలి

హెచ్ 1 బీ వీసా ఫీజును శిక్షణ కోసం వాడాలి

హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల నుంచి వసూలు చేసిన ఫీజులను ఎస్‌టీఈఎం వర్కర్ల శిక్షణ, విద్యను ప్రమోట్‌ చేయడానికి ఉపయోగించాలని సెనేటర్లు కోరారు. ప్రతిభావంతమైన ఇమ్మిగ్రేషన్‌, మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ అని... తమకు ఎక్కువ నైపుణ్యమైన ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ కావాలని హాచ్‌ అన్నారు. వీసా పీజులను పెంచడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎస్‌టీఈఎం విద్యకు, వర్కర్‌ శిక్షణ కార్యక్రమాలకు 1 బిలియన్‌ డాలర్ల కొత్త ఫండింగ్‌ను అందించామని చెప్పారు.

English summary
Two Republican Senators today introduced legislation in the Senate that seeks to increase the annual H-1B visa limit with an aim to bring in the world's "best and brightest" to the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X