వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యా సీన్ హై ..! కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన బిల్లుకు మద్దతు తెలిపిన టీఎంసీ, ఎస్పీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో అసాధారణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్న ఎన్డీఏ సర్కార్ .. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం తెలిపితే .. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో ప్రెసిడెంట్ రూల్ మరో 6 నెలలు కొనసాగనుంది.

 ప్రెసిడెంట్ రూల్ ..

ప్రెసిడెంట్ రూల్ ..

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్క్ష్ షా ప్రవేశఫెట్టారు. దీంతోపాటు కశ్మీర్‌లో రిజర్వేషన్ బిల్లును కూడా ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులు ఇదివరకు లోక్‌సభలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎస్పీ, టీఎంసీ పార్టీలు మద్దతు తెలుపడం విశేషం. గతేడాది జూన్ నుంచి కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీతో బీజేపీకి విభేదాలు తలెత్తాయి. దీంతో బీజేపీ కశ్మీర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే.

మెతకవైఖరి .. మర్మమెంటో ...

మెతకవైఖరి .. మర్మమెంటో ...

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసి చేతలు కాల్చుకున్న ఎస్పీ .. రాజ్యసభలో అనుసరించిన వైఖరి బీజేపీతో దోస్తీ అనే సంకేతాలు ఇస్తోందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి తమ కూటమి నేత మాయావతి ఎస్పీతో కలిసి పోటీచేయబోమని తేల్చిచెప్పడంతో .. ఎస్పీ తమ దారి తాము చూసుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల మోడీ, అమిత్ షాతో కయ్యానికి కాలుదువ్వుతున్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మెతక వైఖరికి కారణమెంటనే చర్చ జరుగుతుంది. బెంగాల్‌ గడ్డ మీద బీజేపీ ఇక కల్పించుకోకూడదని .. మమత ఎత్తువేశారా ? లేక నిజంగా రాష్ట్రపతి పాలనకు మద్దతు తెలిపారా అనే అంశం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

 పరిస్థితుల దృష్ట్యా ..

పరిస్థితుల దృష్ట్యా ..

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలతోపాటు కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి. కానీ పుల్వామా దాడి తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని, శాంతి భద్రతల సమస్య తలెత్తె అవకాశం ఉందని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. దీంతో ఎలక్షన్స్ ప్రక్రియ వాయిదా పడింది. అంతేకాదు లోక్‌సభ ఎన్నికలను కూడా కశ్మీర్‌లో మూడు విడతలుగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

English summary
Union home minister Amit Shah presented two bills -- one for the extension of President's Rule in Jammu and Kashmir and Reservation (Amendment) Bill -- in Rajya Sabha today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X