వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ మేరకు వరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

జమ్మూకాశ్మీర్ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్‍‌ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు ఆర్డినెన్స్ స్థానంలో చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

Bill to replace J&K Reorganization Amendment Ordinance introduced in Rajya Sabha

జమ్మూ కాశ్మీర్ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరిటరీ (ఎజిఎంయుటి) లతో విలీనం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.

జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019ను సవరించాలని ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ప్రకటించారు, జనవరిలో తన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్ సెక్షన్ 13 [ఆర్టికల్ 239 ఎ అనువర్తనం], సెక్షన్ 88 [అఖిల భారత సేవలకు సంబంధించిన నిబంధనలు] ను సవరించింది.

ఎగువ సభ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు రైతుల సమస్యలు ప్రతిపక్ష పార్టీల ఎజెండాలో ఆధిపత్యం చెలాయించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యవసాయ చట్టాలపై మాటల యుద్ధమే జరుగుతోంది.

English summary
Minister of State (MoS) for Home Affairs G Kishan Reddy introduced Bill in Rajya Sabha on Thursday to replace Jammu and Kashmir Reorganisation (Amendment) Ordinance, 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X