బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూపర్ మేడమ్: ఓటు వెయ్యడాని నో చెప్పిన బయోకాన్ టీం మేనేజర్, కేసు పెట్టిన యువతి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఓటు వెయ్యడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన టీం హెడ్ (రిపోర్టింగ్ మేనేజర్) మీద ఓ యువతి పోలీసు కేసు పెట్టింది. ఓటు వెయ్యడానికి ప్రసిద్ది చెందిన బయోకాన్ కంపెనీ అనుమతి ఇచ్చినా టీం మేనేజర్ మాత్రం అభ్యంతరం చెప్పాడని, తాను ఓటు సద్వినియోగం చేసుకోవడానికి అడ్డంకులు సృష్టించారని, ఇదెక్కడి న్యాయం అంటూ ఓ యువతి బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. ఓటు హక్కు వినియోగించకుండా అడ్డుపడిన టీం మేనేజర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బయోకాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువతి బెంగళూరు నగరంలోని విభూతినగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. యువతి ధైర్యంగా కేసు పెట్టడంతో మీరు సూపర్ మేడమ్ అంటూ ఆమెను అభినందిస్తున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

 బయోకాన్ సంస్థలో ఉద్యోగం

బయోకాన్ సంస్థలో ఉద్యోగం

ప్రసిద్ది చెందిన బయోకాన్ కంపెనీలో కావ్య అనే యువతి ఉద్యోగం చేస్తున్నది. కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం పరిధిలో కావ్య నివాసం ఉంటోంది. కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే భైరతీ బసవరాజ్ తన పదవికి రాజీనామా చెయ్యడంతో ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి.

టీం మేనేజర్ లొల్లి

టీం మేనేజర్ లొల్లి

డిసెంబర్ 5వ తేదీ ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి అనుమతి ఇవ్వాలని కావ్య తన టీం మేనేజర్ (రిపోర్టింగ్ మేనేజర్) భరత్ కుమార్ కు చెప్పింది. అయితే నువ్వు కచ్చితంగా గురువారం ఉద్యోగానికి రావాలని, విధులకు హాజరుకాకుండా నువ్వు ఓటు వెయ్యడానికి వీలు లేదని టీం లీడర్ భరత్ కుమార్ తన సాటి ఉద్యోగి కావ్యకు తేల్చి చెప్పాడని సమాచారం.

ఎదురు తిరిగిన యువతి

ఎదురు తిరిగిన యువతి

ఎన్నికల జరిగిన సమయంలో తన సంస్థలో పని చేసే ఉద్యోగులు వెళ్లి ఓటు వెయ్యడానికి బయోకాన్ సంస్థ ముందే అనుమతి ఇచ్చింది. కంపెనీ అనుమతి ఇచ్చిన విషయం కావ్య ఆమె టీం మేనేజర్ భరత్ కుమార్ కు గుర్తు చేసింది. అయితే తాను చెప్పిందే చట్టం, కంపెనీ రూల్స్ తనకు అనవసరం అంటూ కావ్య ఓటు వెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని సమాచారం.

కావ్యకు కోపం వచ్చింది

కావ్యకు కోపం వచ్చింది

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కావ్య ఉద్యోగం చెయ్యవలసి ఉంది. అయితే ఓటు వెయ్యడానికి టీం మేనేజర్ భరత్ కుమార్ అనుమతి ఇవ్వకపోవడంతో కావ్యకు కోపం వచ్చింది. గురువారం ఉద్యోగానికి వెళ్లిన కావ్య జరిగిన విషయం పై అధికారులకు చెప్పింది. ఓటు వెయ్యడానికి బయోకాన్ కంపెనీ అధికారులు కావ్యకు అనుమతి ఇచ్చారు.

పోలీసు కేసు పెట్టిన యువతి

పోలీసు కేసు పెట్టిన యువతి

బయోకాన్ సంస్థ ప్రతినిధులు ఓటు వెయ్యడానికి అనుమతి ఇవ్వడంతో కావ్య నేరుగా విభూతి పురం పోలీస్ స్టేషన్ చేరుకునవ ఆమె టీం మేనేజర్ భరత్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. చట్టపరంగా తనకు ఓటు వేసే హక్కు ఉందని, పై అధికారి అనే నెపంతో తాను ఓటు వెయ్యకుండా తన టీం లీడర్ భరత్ కుమార్ అడ్డుకున్నారని, ఇలాంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే మరో ఉద్యోగికి ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉంటుందని కావ్య పోలీసులకు మనవి చేసింది.

 ఎవ్వరికీ ఇలాంటి సమ్య రాకూడదు

ఎవ్వరికీ ఇలాంటి సమ్య రాకూడదు

తరువాత కావ్య నేరుగా పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకుంది. గడుపు ముగియక ముందే కావ్య తన ఓటు హక్కను సద్వినియోగం చేసుకుంది. ఓటు హక్కు కోసం పై అధికారి మీద ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టిన కావ్యను మీరు సూపర్ మేడమ్ అంటూ పలువురు ఆమెను అభినందిస్తున్నారు. కావ్య ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
BIOCON employee Kavya gave police complaint against her reporting manager for not giving permission to vote in by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X