• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Corbevax : సెప్టెంబర్‌లో అందుబాటులోకి మరో దేశీ కోవిడ్ వ్యాక్సిన్ 'కోర్బెవాక్స్'...

|

దేశీ ఫార్మా సంస్థ బయోలజికల్-ఇ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 'కోర్బెవాక్స్' త్వరలోనే అందుబాటులోకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్‌ ముగింపు నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్‌బీడీ ప్రోటీన్ సబ్-యూనిట్ ప్లాట్‌ఫామ్ అనే కాన్సెప్టుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతుండగా... వచ్చే నెలాఖరు నాటికి అత్యవసర వినియోగం(EUA) కోసం బయాలజికల్-ఇ సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేసుకోనుంది.

  Corbevax: Biological E's COVID-19 Vaccine To Be Launched By September | Oneindia Telugu
  300 మిలియన్ డోసుల సప్లై..

  300 మిలియన్ డోసుల సప్లై..

  బయోలజికల్-ఇ లిమిటెడ్ సంస్థ డిసెంబర్,2021 నాటికి కేంద్రానికి 300 మిలియన్ల డోసులను అందించనున్నట్లు గతంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 కోట్లు అడ్వాన్సును కేంద్రం ఆ సంస్థకు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ సామర్థ్యం గురించి ఇంకా తెలియాల్సి ఉందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్‌కే అరోరా వెల్లడించారు. అమెరికా ఫార్మా కంపెనీ నోవావాక్స్ అభివృద్ది చేసిన NVX-CoV2373కి ఇది దగ్గరగా ఉండే అవకాశం ఉందన్నారు. నోవావాక్స్ వ్యాక్సిన్ కరోనాపై 90.4శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని గతంలో ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌లో కోవావాక్స్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తోంది.

  ప్రస్తుతం 4 వ్యాక్సిన్లు...

  ప్రస్తుతం 4 వ్యాక్సిన్లు...


  భారత్‌లో ప్రస్తుతం నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కోవాగ్జిన్,కోవీషీల్డ్,స్పుత్నిక్ వి,మోడెర్నా వ్యాక్సిన్లు ఉన్నాయి. కోవాగ్జిన్,కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఈ ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి వీటి ద్వారా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతోంది. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ది చేయగా... కోవీషీల్డ్‌ను యూకెకి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ,ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ది చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పుత్నిక్ వి అందుబాటులోకి వచ్చింది. జూన్‌లో అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు కూడా కేంద్రం అనుమతినిచ్చింది.

  త్వరలో చిన్నారులకు అందుబాటులోకి?

  త్వరలో చిన్నారులకు అందుబాటులోకి?

  ప్రస్తుతం 18 ఏళ్లు పైబడ్డవారికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మున్ముందు చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాన్స్,జర్మనీ,పోలాండ్,ఇటలీ,ఆస్ట్రియా,హంగేరీ,లిథువేనియా,రొమేనియా,నార్వే,స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో 12 నుంచి 15 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైదుస్ క్యాడిలా చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ఈ నెల 1న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికైతే కేంద్రం నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు.

  ఇవాళ నమోదైన కరోనా కేసులు...

  ఇవాళ నమోదైన కరోనా కేసులు...

  కరోనా కేసుల విషయానికి వస్తే... దేశంలో కొత్తగా 39,361 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 35,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకూ 3,05,79,106 మంది కోలుకున్నారు. మరో 416 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,967కు పెరిగింది. ప్రస్తుతం 4,11,189 మంది ఆస్పత్రులు,హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ప్ప‌టివ‌ర‌కూ మొత్తం 43,51,96,001 వ్యాక్సిన్ డోసులు వేశారు.

  English summary
  The Covid vaccine 'corbevax', which is being developed by the indigenous pharma company Biological-e Ltd., will be available soon. If all goes well, the vaccine will be available by the end of September this year.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X