వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో మరో వైరస్, ఇప్పుడే కరోనా భయం, హై అలర్ట్ ,కోళ్ల కథ క్లోజ్, చిల్లీ చికెన్, కబాబ్ అంటే హడల్!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్- 19) ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు. భారత్ లోని ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని తెలుసుకున్న కేరళ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అక్కడి ప్రభుత్వం దృవీకరించడంతో అక్కడి ప్రజలతో పాటు కోళ్ల పరిశ్రమ నిర్వహకులు, చికెన్ వ్యాపారులు ఆందోళనకు గురైనారు. కేరళలో చిల్లీ చికెన్, చికెన్ కబాబ్ పేరు చెబితే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!

కజికోడ్ లో కోళ్లు మటాష్

కజికోడ్ లో కోళ్లు మటాష్

కేరళలోని కోజికోడ్ ప్రాంతంలోని కోళ్ల ఫాంలో, ప్రైవేట్ నర్సరీ ఫాంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి బర్డ్ ఫ్లూ వ్యాధి నివారించడానికి తీసకోవాలసిన జాగ్రత్తలపై చర్చించారు.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

కేరళలోని కోళ్ల ఫాంల్లో ప్రతిరోజూ సుమారు 200కి పైగా కోళ్లు చనిపోయాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో అర్థం కాక కోళ్ల ఫాం యజమానులు, నిర్వహకులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వ అధికారులు వెంటనే కణ్ణూరులోని ల్యాబ్, భోపాల్ లోని ల్యాబ్ లకు కోళ్ల స్యాంపిల్స్ పంపించారు.

నో డౌట్, బర్డ్ ఫ్లూ వ్యాధి!

నో డౌట్, బర్డ్ ఫ్లూ వ్యాధి!

కణ్ణూరు ల్యాబ్, భోపాల్ ల్యాబ్ పరిశోధకులు కోళ్ల స్యాంపిల్స్ పరిశీలించి ఆ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని నిర్దారించారు. వెంటనే విషయం తెలుసుకున్న కేరళ ప్రభుత్వ అధికారులు కోజికోడ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, కోళ్ల పరిశ్రమ నిర్వహకులు అప్రమత్తం చేశారు.

కేరళ మంత్రి క్లారిటీ

కేరళ మంత్రి క్లారిటీ

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని నిర్దారణ అయ్యిందని, అయితే ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని కేరళ మంత్రి కే. రాజు తిరువనంతపురంలో మీడియాకు చెప్పారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించామని, ఆ వ్యాధిని అరికట్టడానికి ఆరోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కే. రాజు వివరించారు.

ఫస్ట్ చంపేయండి, తరువాత చూద్దాం!

ఫస్ట్ చంపేయండి, తరువాత చూద్దాం!

కేరళలోని అనేక కోళ్ల ఫామ్స్ నిర్వహిస్తున్న పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని వెలుగు చూడటంతో HSN1 వ్యాధిని అరకట్టడానికి అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బర్డ్ ఫ్లూ సోకిన అన్ని కోళ్లను మొదట చంపేయాలని, తరువాత వేరే విషయాలు ఆలోచించాలని అధికారులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు కేరళలోని అనేక ప్రాంతాల్లో కోళ్లను చంపేస్తున్న అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Bird Flu confirmed in Kerala, Kerala State on High Alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X