ఢిల్లీ, మహారాష్ట్రలలో బర్డ్ ఫ్లూ భయం ..పర్బానీలో 9 వేల పక్షులను చంపెయ్యాలని ఆదేశం
బర్డ్ ఫ్లూ వ్యాప్తి మహారాష్ట్రలో కూడా నిర్ధారించబడింది. చనిపోయిన కాకులు వల్ల ముంబైలో భయాందోళన రేకెత్తుతోంది . పర్భానిలో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. ఇక్కడ అధికారులు 9,000 పక్షులను చెంపెయ్యాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా,ఢిల్లీ లో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేగింది . ఎనిమిది నమూనాలను పరీక్షించిన తరువాత నగరంలో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని ఢిల్లీలో పశుసంవర్ధక విభాగం నిర్ధారించింది.

మహారాష్ట్రకు బర్డ్ ఫ్లూ పరేషాన్ .. నేడు సీఎం ఉద్దవ్ ఠాక్రే సమావేశం
మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై నుండి 500కిలోమీటర్ల దూరంలోని పర్బానీ దగ్గర గత రెండు రోజుల్లో సుమారు 800 కోళ్ళు చనిపోయాయి . వాటి నమూనాలను పరీక్ష కోసం పంపిన అధికారులు ఇప్పుడు దీనికి కారణం బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు. మురుంబా గ్రామంలో బర్డ్ ఫ్లూ ధృవీకరించబడిందన్నారు . సుమారు ఎనిమిది పౌల్ట్రీ ఫారమ్ లు , 9,000 పక్షులు అక్కడ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ కోళ్ళను చంపడానికి మేము ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బర్డ్ ఫ్లూ పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నారు.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న గ్రామాన్ని నిషేధిత గ్రామంగా ప్రకటించిన పర్బానీ జిల్లా కలెక్టర్
పర్భాని జిల్లా కలెక్టర్ దీపక్ ముల్జికార్ మాట్లాడుతూ, మానవ జీవితానికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు . తాము ప్రజలను కూడా టెస్ట్ చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు . మానవులకు వ్యాప్తి చెందే భయం లేదని చెప్పారు. కోళ్ళు చనిపోయిన గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. లాతూర్ లో 400 పక్షులు చనిపోయినట్లు, అమరావతిలో 40 కోళ్ళు చనిపోయినట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల నుండి నమూనాలను పరీక్ష కోసం పంపారు.

ఇప్పటికే ఏడు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ భయం
ముంబైలోని చెంబూర్‌లో 11 చనిపోయిన కాకులు కనిపించాయి. దీంతో ఏవియన్ ఫ్లూ భయంతో ఆందోళన కనిపిస్తోంది . ఇక ఈ కాకుల పరీక్ష కోసం రెండు నమూనాలను పంపారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో చనిపోయిన పక్షులను గతంలో గుర్తించారు. దేశంలోని కేరళ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి అనేక ఇతర రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించడంతో ఇది జరిగింది. బర్డ్ ఫ్లూ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జంతుప్రదర్శనశాల మూసివేయబడింది .

ఢిల్లీ లోనూ బర్డ్ ఫ్లూ కలకలం , బర్డ్ ఫ్లూ తో బాతులు మృతి
న్యూ ఢిల్లీ లోని సంజయ్ సరస్సు వద్ద ఆదివారం మరో 17 బాతులు చనిపోయినట్లు గుర్తించగా, అధికారులు దీనిని "హెచ్చరిక జోన్" గా ప్రకటించారు. ఢిల్లీలోని పశుసంవర్ధక శాఖ విభాగం ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. చనిపోయిన కాకులు మరియు బాతుల నుండి ఎనిమిది నమూనాలను పరీక్షించిన తరువాత బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. అన్ని నమూనాలు ఏవియన్ ఫ్లూ సోకినట్టుగా తేలటంతో ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. దక్షిణ ఢిల్లీ లోని ప్రసిద్ధ హౌజ్ ఖాస్ పార్కును అధికారులు మూసివేసారు, ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది, అలాంటి పార్క్ కూడా మూసివేయబడింది .