వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌లో బీజేపీ తొలిసారి: సీఎంగా బీరేన్ ప్రమాణం, అందుకే అమిత్ షా గైర్హాజరు

మణిపూర్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు.

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ 21 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ అత్యధికంగా 28 స్థానాలు సాధించినా.. బీజేపీకే చిన్న పార్టీలు మద్దతు పలికాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా బీజేపీని ఆహ్వానించారు. గత అక్టోబర్‌లో పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్‌ నేత బీరెన్‌ సింగ్‌ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Biren Singh sworn in as Chief Minister of Manipur

మధ్యలోనే తిరిగివెళ్లిపోయిన అమిత్ షా

మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హాజరుకాలేకపోయారు. తొలుత మణిపూర్‌ బయల్దేరిన అమిత్‌ షా విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఆయన విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. బుధవారం మధ్యాహ్నం బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.

English summary
BJP's N Biren Singh has been sworn in as chief minister of Manipur on Wednesday at the Raj Bhawan in Imphal. Manipur Governor Najma Haptullah had invited BJP-led coalition to form the next government after she was assured that BJP has support of regional parties and Independent MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X