వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లీం యువతుల పెళ్లికి గ్రామ హిందువుల సాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

గ్రేటర్ నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లో దాద్రీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి సమయంలో ఓ గ్రామానికి చెందిన హిందువులు అందరూ... ఓ పేద ముస్లీం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. ఈ సంఘటన బిసడ గ్రామంలో జరిగింది.

బిసడ గ్రామానికి హకీమ్ అనే వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల పెళ్లి ఆదివారం ఉదయం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఖర్చులు గ్రామానికి చెందిన హిందువులు భరించారు.

Bisada Hindus fund Muslim wedding

అంతేకాదు, తన కూతుళ్ల పెళ్లి నేపథ్యంలో హకీమ్ తొలుత.. గ్రామం బయట ఈ వేడుకను ఏర్పాటు చేద్దామనుకున్నాడు. దాద్రీలో మాంసం ఘటన, మృతి నేపథ్యంలో.. గ్రామం బయట పెళ్లి చేద్దామని భావించాడు.

అయితే, గ్రామంలోని హిందువులు అందరూ ఆయనకు అండగా నిలబడ్డారు. అలాంటి ఘటనలు ఏమీ ఉండవని, అందరం అండగా నిలబడతామని చెప్పారు. దీంతో హకీమ్ కుటుంబం ఆదివారం గ్రామంలో పెళ్లి చేసింది. ఇందుకు గ్రామంలోని హిందువులు ఆర్థిక సాయం కూడా చేశారు.

English summary
The two daughters of Hakeem, a Muslim villager in Bisada, will get married on Sunday morning, and some Hindus from the village are bearing the wedding expenses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X