వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 వేల ఉద్యోగాలకు పార్లే జీ కోత.. తగ్గిన కంపెనీ బిస్కెట్ విక్రయాలు .. ఆర్థికమాంద్యం కూడా కారణమట ...

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : బిస్కెట్ పరిశ్రమను ఆర్థిక మాంద్యం చుట్టుమట్టింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బిస్కెట్ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఉంది. దీంతో తాము మరింత నష్టాలు చవిచూడకముందే కొన్ని కంపెనీలు తేరుకుంటున్నాయి. పెట్టుబడి ఉత్పాదకత తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ఉద్యోగులను కూడా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లే జీ కంపెనీ ముందువరసలో ఉంది. ఆర్థిక మాంద్యం, బిస్కెట్ విక్రయాలు తగ్గడంతో భారీగా ఉద్యోగాలకు కోత పెట్టింది.

పార్లే జీ ఉద్యోగాల కోత ..

పార్లే జీ ఉద్యోగాల కోత ..

దేశంలో పేరున్న బిస్కెట్ తయారీ సంస్థ పార్లే జీ. బిస్కెట్ తయారీ పరిశ్రమకు ఆర్థిక మాంధ్యంతో ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. తమ కంపెనీకి చెందిన 10 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేసంది. ఆర్థికవృద్ధి మందగించడంతో .. ఉద్యోగాలపై వేటు వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. దీంతో బిస్కెట్ ఉత్పత్తి, ఉత్పాదకత కూడా తగ్గిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

బిస్కెట్ పరిశ్రమ కూడా ..

బిస్కెట్ పరిశ్రమ కూడా ..


ఆసియాలో వస్త్రాలు, కార్ల ఉత్పత్తి తర్వాత బిస్కెట్ల తయారీ పెద్ద పరిశ్రమ. అయితే ఆర్థిక మాంద్యంతో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పార్లే జీ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొన్నది. తమ కంపెనీ బిస్కెట్ విక్రయాలు కూడా భారీగా పడిపోయాయని పేర్కొన్నది. దీంతో 8 నుంచి 10 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని పేర్కొన్నది.

ఎదుగుతూనే ..

ఎదుగుతూనే ..

1929లో ప్రారంభమైన పార్లే జీ కంపెనీ క్రమక్రమంగా ఎదిగింది. దేశంలో 10 కేంద్రాల్లో ఉత్పత్తి జరుగుతుంది. 125 కాంట్రాక్టు మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. పార్లే జీ కంపెనీలో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే బిస్కెట్ల కొనుగోలు నిలిచిపోవడంతో .. కంపెనీని నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. చిన్న బిస్కెట్ ప్యాకెట్ రూ.5 విక్రయించిన .. దానిపై 7 శాతం పన్నువేస్తున్నారు. దీంతో క్వాలిటీ తగ్గడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. పార్లే జీకి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. జీఎస్టీ అమలు చేయడంతో వారికి కొంచెం నష్టం కలిగించింది.

English summary
Parle Products Pvt Ltd, a leading biscuit maker, might lay off up to 10,000 workers as slowing economic growth and falling demand in the rural heartland could cause production cuts, a company executive said on Wednesday. A downturn in Asia's third-largest economy is denting sales of everything from cars to clothing, forcing companies to curtail production and raising hopes that the India government will unveil an economic stimulus to revive growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X