వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ నన్ రేప్ కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో జలంధర్‌ చర్చ్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్‌ అయిన తొలి భారతీయ కాథలిక్‌ బిషప్‌ ములక్కల్‌.

కొచ్చిలో శుక్రవారం సాయంత్రం బిషప్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఫ్రాంకో ములక్కల్‌ జలంధర్‌ చర్చ్‌ కేరళలో నిర్వహిస్తున్న స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

కేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదంకేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదం

Bishop Franco Mulakkal arrested in Kerala nun rape case

2014 నుంచి 2016 వరకూ ములక్కల్‌ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేరళ నన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన క్రమంలో పాస్టర్‌ బాధ్యతల నుంచి తప్పించాలని పోప్‌కు ములక్కల్‌ లేఖ రాసిన క్రమంలో ఆయన స్ధానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్‌ నుంచి అధికారిక సమాచారం అందిందని చర్చి వర్గాలు తెలిపాయి.

బిషప్‌ను అరెస్ట్‌ చేసే ముందు ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలి నుంచి తాజా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మూడు రోజుల కిందట కేసుకు సంబంధించి ములక్కల్‌ను పోలీసు అధికారులతో కూడిన సిట్‌ బృందం ప్రశ్నించింది. మూడురోజులపాటు ప్రశ్నించిన అనంతరం ములక్కల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
The Kerala Police today arrested bishop Franco Mulakkal for allegedly raping a nun multiple times between 2014 and 2016, a police source said. An official announcement is expected later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X